శభాష్ సి.వి.ఆనంద్

ప్లాస్టిక్ రైస్ అంటూ సామాజిక మాధ్యమాలతో పాటుగా మీడియాలో జరుగుతున్న విస్తృత ప్రచారంతో సాధారణ ప్రజలు తీవ్ర కలవరానికి గురయ్యారు. నగరంలోతో పాటుగా తెలుగు రాష్ట్రాలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బియ్యం అమ్మకాలు జరుగుతున్నాయని అనేక చిన్న చిన్న హోటళ్లలో ప్లాస్టిక్ బియ్యాన్నే అమ్ముతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనికి తోటు ప్లాస్టిక్ బియ్యం తాయారీ అంటూ ప్రత్యక్షమైన కొన్ని వీడియోలు ఆందళన రేకెత్తించాయి. ఈ క్రమంలో అసలు ప్లాస్టకి రైస్ అంటే ఏమిటి దాన్ని ఎట్లా తయారు చేస్తారు. ఎక్కడి నుండి వస్తున్నాయి. దీన్ని గుర్తించడం ఎట్లా అనే విషయాలు ఏమీ తెలియక అసలు వాస్తవం వెల్లడి కాక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషన్ సి.వి.ఆనంద్ స్పందిచిన తీరును ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. ప్లాస్టిక్ రైస్ పై సమాచారం అందుకున్న వెంటనే శాంపిళ్లను తెప్పించడంతో పాటుగా ఆఘమేఘాల మీద వాటిని పరీక్షించి ప్లాస్టిక్ రైస్ పై ప్రజలకు వాస్తవాలను వెల్లడించారు. అధికారికంగా పౌరసరఫరాల శాఖ ఇచ్చిన సమాచారంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ప్లాస్టిక్ రైస్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని అది కేవలం అపోహలు మాత్రమేనని పౌరసఫరాల శాఖ స్పష్టం చేయడంతో ప్రజలు నెత్తిమీద పెద్ద బరువు దిగినట్టయింది. ఇప్పటివరకు ఏది అసలు బియ్యమో ఏది నకిలీ బియ్యమో తెలియక అవస్తలు పడుతున్న వారికి ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంది. దీనితో తోడు అన్నాన్ని కింద వేస్తే బంతిలా ఎగరడానికి సంబంధించి కూడా పౌరసరఫరాల శాఖ వివరణ ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణ బియ్యంతో వండిన అన్నాన్ని కూడా గట్టిగా ఉండలు చేస్తే అది కూడా బంతిలాగా పైకి ఎగురుతుందని వివరించడంతో ప్రజల్లో ఉన్న భయాలు తొలగిపోయాయి. దీనికి తోడు బియ్యం శాంపిళ్లపై మరింత విశ్లేషణ కోసం వాటిని పరీక్షలకు పంపి ఏదైనా అక్రమాలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని సి.వి.ఆనంద్ హెచ్చరించారు. మొత్తం మీద ప్లాస్టిక్ రైస్ వ్యవహారంలో సి.వి.ఆనంద్ వ్యవహరించినతీరు, చొరవ అభినందనీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *