అది ప్లాస్టిక్ రైస్ కాదు

0
72

ప్లాస్టిక్ బియ్యం పై వస్తున్న వార్తల్లో నిజంలేదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. నగంరలోని పలు చోట్ల ప్లాస్టిక బియ్యం అమ్ముతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ప్లాస్టిక్ బియ్యంగా ఫిర్యాదులు అందిన చోట్ల శాంపిళ్లను సేకరించి పరీక్షించగా అవి ప్లాస్టిక్ బియ్యం కాదనే సంగతి బయటపడిందని పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్లాస్టిక్ బియ్యం పై వస్తున్న వార్తలను పూర్తిగా నిరాధారమని పౌరసఫరాల శాఖ స్పష్ట ంచేసింది. ప్లాస్టిక్ బియ్యం కాదని ప్రాథమికంగా తేలినా మరింత విశ్లేషణ కోసం  శాంపిళ్లను రాష్ట్ర ఫుడ్ లేబరేటరీకీ పంపినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ వెల్లడించారు. ప్లాస్టిక్ బియ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు. బియ్యాన్ని నీటిలో నానబెట్టి పరీక్షించామని ప్లాస్టిక్ రైస్ అయితే నీటిలో తేలుతుందని ఆ ప్రకటనలో వివరించారు. బియ్యాన్ని అదేవిధంగా అన్నాన్ని కూడా పరీక్షించి అదీ సాధారణ బియ్యమేనని నిర్థారించారు. ప్లాస్టిక్ రైస్ కాదు సాధారణ అన్నాన్ని కూడా ముద్దగా చేసి కిందపడేస్తే బంతిలాగా ఎగురుతుందని అది సాధారణమేనని వివరించారు.
ప్లాస్టిక్ రైస్ పై వస్తున్న ప్రచారన్ని జనవిజ్ఞాన వేదిక కూడా ఖండించింది. దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా పాలిష్ చేసినపుడు అన్నం ముద్దగా కావడం బంతిలా ఎగరడం జరుగుతుందని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని వారు స్పష్టం చేశారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here