త్వరలో రాహుల్ కు పార్టీ పగ్గాలు

0
65

అఖిలభారక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోనియా గాంధీ నివాసంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీసమావేశంలో రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. రాహుల్ కు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ తల్లి సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 1998 నుండి సోనియా ఈ పదవిలో కొనసాగుతున్నారు. సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆమె స్థానంలో రాహుల్ కు పగ్గాలు అప్పచెప్పేందుకు పార్టీ రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీలోని 2వేల మంది ప్రతినిధులతో పాటుగా సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. త్వరలోనే పార్టీ అంతర్గత ఎన్నికలను పూర్తి చేస్తామని కాంగ్రెస్  పార్టీ నేతలు చెప్తున్నారు. గత 12 సంవత్సరాలుగా పార్టీలో అంతర్గత ఎన్నికలను నిర్వహించడం లేదు. 2005 నుండి ఈ  ఎన్నికలు జరగడం  లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎంపిక ఇక లాంఛనమే.
రాహుల్ గాంధీ  నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీకి అచంచల విశ్వాసం ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన నాయకత్వ పటిమపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ అత్యన్నత స్థాయి నేతలు భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాల  ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలకు పూర్తిగా రాహుల్ దే బాధ్యతని ఆయన నాయకత్వ లేమి వల్లే పార్టీ పూర్తిగా నష్టపోతోందనే విమర్శలను పార్టీ పట్టించుకోవడం లేదు. ఒక పథకం ప్రకారం రాహుల్ ను అప్రదిష్ట పాలు చేసేందుకు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో నెంబర్ టూ ఉన్న రాహుల్ ఇక పార్టీ అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో బాధ్యతలను బుజానికి ఎత్తుకోనున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here