దాసరి మరణానికి కారణం అదేనా…?

0
63

దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతికి కారణం ఏమిటి..? బరువు తగ్గేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు వికటించి ప్రాణం మీదకు తెచ్చాయా..? ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం దాసరి నారాయణ రావుకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అధిక బరువు వల్ల ఆయన కొద్దిగా ఇబ్బందులు పడేవారు. బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఆయన ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, ఆయాసం వంటి సమస్యలను ఎదుర్కొనే వారు . ఈక్రమంలో బరువు తగ్గించుకునేందుకు దాసరి చేసిన ప్రయ్తనాలు ఆయన ప్రాణం మీదకు తెచ్చాయని తెలుస్తోంది. ఆకలి మందగించేలా చేయడం కోసం అన్న వాహికకు బెలూన్ వేసే చికిత్స విధానంలో బరువు తగ్గేందుకు దాసరి ప్రయత్నించారు. గత సంవత్సరం ఆయన ఈ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న తరువాత దాసరి బరువు తగ్గారు. చికిత్సలో భాగంగా రెండో సారి కూడా ఆపరేషన్ చేయించుకునేందకు ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఆపరేషన్ చేసే క్రమంలో అది కాస్త వికటించి అన్నవాహికకు రంధ్రం పడినట్టు తెలుస్తోంది. అన్న వాహికకు పడిన రంద్రాన్ని పూడ్చేందుకు డాక్టర్లు వేసిన స్టంట్ పొట్టలోకి వెళ్లిపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీనికి తోడు ఆయన ఊపిరితిత్తుల్లోకి కూడా నీరు చేరిందనేది ఆ వర్గాల కథనం. వైద్యులు ఎంత శ్రమించి నప్పటికీ దాసరిని తిరిగి మామూలు స్థితికి తీసుకుని రాలేకపోయారు.
దాసరి నారాయణ రావుకు చికిత్సలో భాగంగా ఉదర భాగంలో మొత్తం 8 రంద్రాలు చేసినట్టు తెలిసింది. అయినా ఆయన్ను వైద్యులు రక్షించలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే దాసరి నారాయణ రావుకు గుండెపోటు రావడంతో ఆయన  తుదిశ్వాస విడిచారు. దాసరికి చేసిన ఆపరేషన్ విఫలం అయిందా లేక దాన్ని దాసరి శరీరం తట్టుకోలేకపోయిందా అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే దాసరికి ఆసపరేషన్ చేసే ముందే ఇందులో ఉన్న రిస్క్ ను గురించి వైద్యులు ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. సన్నబడాలనే తపనతోనే దాసరి ప్రాణం మీదకు తెచ్చుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here