తీరనున్న పారిశుధ్య కార్మికుల కష్టాలు

0
45

హైదరాబాద్ మహానగరంలో భుగర్భ డ్రైనేజీల్లో మురుగు నీటి ప్రవాహానికి ఏర్పడిన అడ్డంకుల వల్ల అవి పొంగి పొర్లడం సాధారణం. డ్రైనేజీలలో ఏర్పడిన అడ్డంకులను తొలగించి మురుగునీరు తిరిగి పారే విధంగా చేయడానికి తరచూ మురికి మ్యాన్ హోల్స్ లో పారిశుద్ధ్య కార్మికులు  దిగడం మనకు నిత్యం కనిపించే దృశ్యామే. డ్రైనేజీలను బాగు చేయడం కోసం అత్యంత అమానవీయ పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు పనిచేస్తూ కనిపిస్తుంటారు. ఈ క్రమంలో తరచూ కార్మికులు ప్రమాదాలకు గురికావడంతో పాటుగా ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో అయ్యప్ప సొసైటీ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత కార్మికులు డ్రైనేజీల్లో దిగకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. గతంలో కొనుగోలు చేసిన భారీ యంత్రాలు పూర్తిగా సరిపోకపోవడంతో తాజాగా 70 మినీ మిషన్లను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. వీటిని మురుగునీటి ప్రవాహాలకు ఏర్పడిన అడ్డంకులను తొలగించే పనికోసం వినియోగిస్తారు. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం మ్యాన్ హోల్స్ ను పారిశుద్యకార్మికులు శుబ్రపర్చే అవసరం లేకుండా యంత్రాలను ఉపయోగించనున్నారు. దీని వల్ల మురుగు నీటిలో కార్మికులు దిగాల్సిన అగత్యం తప్పుతుంది.
మహా నగరంలో సుమారు ఆరువేల కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటిపై రెండులక్షలకు పైగా మ్యాన్‌హోల్‌ మూతలున్నాయి. వీటిలో నిత్యం పలు ప్రాంతాల్లో మురుగు నీటి ప్రవాహం పెరిగి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేసే క్రమంలో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా 70 యంత్రాలు అందుబాటులోకి వచ్చినట్టు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here