సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడి 4గురు ఉగ్రవాదుల హతం

0
47

జమ్మూ కాశ్మీర్ లోని సీఆర్పీఎఫ్ బెటాలియన్ పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ందిపొరా జిల్లాలోని సంబల్ వద్ద ఉన్న 45 సీఆర్పీఎఫ్ బెటాయిలియన్ పై చీకటిమాటున దాడి చేశారు. తెల్లవారు జామున 3.30 సమంయలో  ఒక్కసారిగా క్యాంప్ లోకి విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలును సీఆర్పీఎఫ్ బలగాలు  నిర్వీర్యం చేశాయి. ఉగ్రవాదులపై ఎదురుదాడికి దిగిన బలగాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. పెద్ద ఎత్తున ఆయుధాలతో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రాదులు చేసిన ప్రయత్నాలను సీఆర్పీఎఫ్ బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.  సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని భారీ విధ్వంసానికి ఆత్మాహుతి దాడిచేసిన ఉగ్రవాదులను నిలువరించిన సీఆర్పీఎఫ్ బలాగాలు దాడికి ప్రయత్నించిన నలుగురినీ విజయవంతంగా తుదముట్టించాయి. తూటాల వర్షం కురిపిస్తూ భద్రతా బలగాలపైకి వచ్చిన వారిని సీఆర్పీఎఫ్ జవాన్లు అత్యంత ధైర్య సాహసాలను అంతం చేశారని సీఆర్పీఎఫ్ ఒక ప్రటనలో పేర్కొంది. మరణించిన ఉగ్రవాదుల వద్ద భారీ ఎత్తున ఆయుధాలు, మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here