ఉన్మాదం తలకెక్కి…మానవత్వాన్ని మరచి… లండన్ లో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కత్తులతో స్వైరవిహారం చేసి కుత్తుకులను కోసేశారు. “అల్లా కోసం” అంటూ అరుస్తూ మారణహోమం సృష్టించిన ఈ రాక్షసులు 7గురి ప్రాణాలను బలితీసుకోగా 41 మందిని తీవ్రంగా గాయపర్చారు. ఒక బాలిక ఒంటిపై ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్టుగా గుర్తించారు. అత్యంత కిరాతకంగా బాలికను బలితీసుకున్న వీళ్లను ఏమనాలి… తమ ప్రాణం పై తీపిలేని ఈ దుర్మార్గులకు ఇతరుల ప్రాణాలు తీయడం ఓ లెక్కా… ప్రాణాలు పోతాయని తెలిసినా వీరు చేస్తున్న అరాచకం దేనికోసం… ఇంతగా వీరిని మత్తులో ముంచిన వారెవరు…బాంబులు, తుపాకులు కాదు వాహనాలు, ఇంట్లో ఉపయోగించే కత్తులను ఆయుధాలుగా చేసుకుని ప్రాణాలు తీస్తున్న ఇటువంటి వారిని నిలువరించడం ఎంత వరకు సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు తాము పెంచి పోషించిన పాములు ఇప్పుడు వారినే కాటు వేస్తున్నాయి. ఈ విషనాగుల కోరలు పీకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మతం మత్తో…పైశాచిక ఆనందంమో… సమాజంపై కసో… కారణం ఏదైనా ఇటువంటి వారిని పావులుగా వాడుకుంటూ ప్రపంచాన్ని భయం గుప్పిట్లో ఉంచుతున్న అసలు నేరస్థులను పట్టుకోవాలి. జనబాహుళ్యంలోకి ఇటువంటి కాట్ల కుక్కలను వదులుతున్న వారిని సమూలంగా అంతమెందించాలి. మానవాళికి పట్టిన ఈ చీడ వదిలే రోజు కోసం శాంతికాముకులు ఎదురు చూస్తున్నారు.