లండన్ లో ఉగ్రదాడి…

0
38

ఇంగ్లాండ్ లో మరోసారి ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. మాంచెస్టర్ లో బాంబుదాడులు చేసిన ఉగ్రవాదులు లండన్ లో పేట్రేగిపోయి ఏడుగురి ప్రాణాలను బలితీసుకున్నార. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో వ్యాన్ లో వచ్చిన ఉగ్రమూకలు గంటకు 50  మైళ్ల వేగంతో దూసుకుని వచ్చి పాదచారులను ఢీకొట్టారు. వాహనం అదుపుతప్పి గోడకు ఢీకొట్టిన వెంటనే అందులో నుండి కింద దిగి కత్తులతో కనపడిన వారిపై కత్తులతో దాడిచేశారు. ఈ దాడిలో 7గురు ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఒక పోలీసు అధికారి, జర్నలిస్టు కూడా ఉన్నారు. ముగ్గురు తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. హతుల వద్ద పేలుడు పదార్ధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here