నేతాజీ మరణ మిస్టరీపై కేంద్రం యూ టర్న్…

0
50

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారంటూ ప్రకటించిన  కేంద్ర ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది.  నేతాజీ కుటుంబ సభ్యులు అభ్యంతరాలు, రాజకీయ పార్టీల విమర్శలతో కేంద్ర ప్రభుత్వం నేతాజీ మరణంపై తన ప్రకటనను వెనక్కి తీసుకుంది. సమాచారా హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జవాబుగా నేతాజీ 1945 ఆగస్టు 18 చనిపోయారంటూ ప్రకటించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విమర్శలకు దడిసి నేతాజీ మరణ మిస్టరీపై కొత్త వాస్తవాల కోసం ప్రయత్నిస్తున్నట్టు కొత్త పల్లవి అందుకుంది. తొలుత కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ప్రధాని మోడీని కలిస్తానని దాని తర్వాత తమ కార్యాచరణనను ప్రకటిస్తామని నేతాజీ కుటుంబ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రబోస్ పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. దీనితో కేంద్ర నేతాజీ పై తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తోంది.

 • 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజి చనిపోయినట్టు అప్పట్లో జపాన్ న్యూస్ ఎజెన్సీ ప్రకటించింది.
 • ఈ వార్తను మహాత్మా గాంధీ విశ్వసించారు. నిర్భీతితో బతకడం నేతాజీని చూసి నేర్చుకోవాలంటూ గాంధీ అప్పట్లో ప్రకటించారు.
 • గత 72 సంవత్సరాలుగా నేతాజీ మరణంపై అనుమానాలు లేవనెత్తుతూనే ఉన్నారు.
 • అప్పటి నుండి నేతాజీ మరణం ఒక మిస్టరీగా మారింది.
 • నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు మూడు కమీషన్లను నియమించింది.
 • నేతాజీ కి సంబంధించిన దస్తావేజులను బయటపెట్టాలని మోడీ సర్కారు నిర్ణయించి 2015లో వాటిని ప్రజల ముందు ఉంచింది. అయితే ఈ రహస్య దస్తావేజుల్లో కొత్త విషయాలు పెద్దగా ఏవీ బయటపడలేదు.
 • సమాచార హక్కు చట్టం కింద ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేతాజీ 1945లోనే మరణించారంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
 • షానవాజ్ కమిటీ, జస్టిస్ ఖోస్ లా కమీషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్ చేసిన విచారణల ఆధారంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో మరణించారని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.
 • ఇన్నాళ్లు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటనా చేయని కేంద్ర ప్రభుత్వం తాజాగా బోస్ మరణంపై స్పష్టమైన ప్రకటన చేసింది.
 • కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో బోస్ కుటుంబ సభ్యులు విభేదిస్తున్నారు.
 • 1945 రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తరువాత జపాన్ కు చెందిన బాంబర్ విమానంలో నేతాజీ థాయ్ ల్యాండ్ మీదుగా మంచూరియా కు వెళ్లే ప్రయత్నం లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని వార్తలు వచ్చాయి.
 • ఆయనతో పాటుగా ప్రయాణిస్తున్న జపాన్ సైనిక అధికారులు కూడా ఈ ప్రమాదంలో మరణించారని సమాచారం.
 • విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బోస్ టోక్యో జనరల్ ఆస్పత్రిలో కన్నుమూశారని భావిస్తున్నారు.
 • బోస్ చనిపోయిన రోజే ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయని. ఒక బౌద్ద ఆలయంలో ఆయన అస్తికలను భద్రపర్చినట్టు తెలుస్తోంది.
 • దీనికి సంబంధించి ఎటువంటి ఫొటోలు లేవు.
 • బోస్ మరణించలేదని ఆయన జపాన్ నుండి రష్యాకు వెళ్లిపోయారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. బోస్ మరణాన్ని వారు ఆంగీకరించలేదు.
 • 11954 ఫిబ్రవరిలో నేతాజీని కొంత మంది రష్యాలో గుర్తించారనే వార్తలు గుప్పుమన్నాయి.
 • బోస్ రష్యాలో రాజకీయ ఆశ్రయం పొందారని కొందరు చరిత్రకారుల విశ్వాసం. దీనికి సంబంధించి నాటి కమ్యూనిస్టు పార్టీ మినిట్స్ బుక్స్ లో బోస్ ఆశ్రయం గురించి చర్చ జరిగినట్టు రాసిఉందని వారు చెప్తున్నారు.
 • రష్యా నుండి భారత్ కు తిరిగి వచ్చిన నేతాజీ ఫైజా బాద్ లో గుమ్నామీ బాబా గా జీవించారనే ప్రచారం ఉంది.
 • గుమ్నామీ బాబానే నేతాజీ అని నమ్మే వాళ్లే ఎక్కువ.
 • గుమ్నామీ బాబా 1985లో చనిపోయారు.
 • కోర్టు ఆదేశాల మేరకు బాబా కు చెందిన వస్తువులను జిల్లా బాండాగారానికి తరలించారు.
 • ఈ వ్యవహారంపై జస్టిస్ ముఖర్జీ కమీషన్ ను నియమించారు.
 • ముఖర్జీ కమిషన్ మాత్రం బోస్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసింది.
 • భారత్ తో పాటుగా జపాన్ కూడా బోస్ మరణంపై విచారణ జరిపింది.
 • జపాన్ ప్రభుత్వం కూడా నేతాజీ 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదం లో మరణించారని తేల్చింది.
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here