నిలవాలంటే గెలవాల్సిందేనా…!

0
46

ఆహా ఇంతలో ఎంత తేడా…రాళ్లతో కొట్టిన వాళ్లే పూలతో స్వాగతం పలికారు…ఈసడించుకున్నవారే ఆహా అంటున్నారు… ఇంట గెల్చి రచ్చ గెలవాలన్నారు పెద్దలు కానీ రచ్చ గెలిచేదాకా ఇంటివాళ్లకి గెల్చిన వాళ్ల విలువ తెలియలేదు. సివిల్స్ లో మూడో ర్యాంకర్ గోపాలకృష్ణ తెలుగు మీడియంలో చదివి, ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఇచ్చి ఎంత సంచలనం రేపాడో తన స్వాగ్రామంలో వెలికిగురైన విశేషాలు అంతకన్నా ఎక్కువ ఆశక్తిని కలిగిస్తున్నాయి. బీసీ వర్గానికి చెందిన ఇతని కుటుంబం ఎస్.సి వర్గానికి చెందిన వారి శుభకార్యాలనికి వెళ్లి పెళ్లి విందులో పాల్గొన్న చిన్ననేరానికి సంవత్సరాలుగా ఆ ఇంటిని వెలివేసిన పెద్ద అంతటితో ఆగకుండా వారిని నానా రకాలుగా హింసకు గురిచేశారని గోపాల కృష్ణ కుటుంబం చెప్తోంది. తమ ఇంటిపై దాడిచేశారని, తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారని అంటోంది. చిన్న విషయానికే ఈ కుటుంబంపై అంత కోసం ఎందుకో… లేక ఇతరత్రా ఏదైనా కారణాలు ఉన్నాయో కానీ గోపాల కృష్ణ జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఆ కుటుంబాన్ని గ్రామస్థులు అక్కున చేర్చుకుంటున్నారు. మా వాడు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఓడిన నాడు వెన్ను తట్టాల్సింది పోయి గెల్చిన నాడు సంబరాలు చేసుకుంటున్నారు. గోపాలకృష్ణను ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్న వారు గతంలో సివిల్స్ ఓడినప్పుడు ఏమయ్యారు. కనీస ప్రోత్సాహం అందించారా.. వెన్నుతట్టి మేమున్నాం అంటూ అభయం ఇచ్చారా… గెల్చిన నాడు మీ మెచ్చుకోలు అవసరం లేదు , ఎడిన నాడు వెన్నుతట్టడం ముఖ్యం.
సరే గోపాల కృష్ణ కుటుంబం పెద్ద తప్పే చేసిందనుకుందాం… వారిది క్షమించరాని నేరమే అనుకుందాం… మరి అలాంటప్పుడు వారి కుటుంబంలో ఒకరు జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకోవడంతోనే వారు చేసిన తప్పులన్నీ ఒప్పులయ్యాయా..! మనకి అంత క్షమా గుణం ఇంటే ఇన్నాళ్లు అది ఏమయింది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం పారసంబ గ్రామానికే పరిమితం కాదు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఒక్క గ్రామాన్ని తప్పుబట్టడం కాదు. గోపాలకృష్ణ జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో అతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది గానీ ఎందరో గోపాలకృష్ణలు ఇంకా చీకట్లోనే మగ్గిపోతున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here