సర్జికల్ దాడుల ఫలితంగా తగ్గిన చొరబాట్లు

0
47

తీవ్రవాద శిభిరాలపై భారత్ నిర్వహించిన సర్జికల్ దాడుల వల్ల భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లు గణనీయంగా తగ్గాయని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెళ్లడించారు. గత మూడు సంవత్సరాల్లో కేంద్ర హోంశాఖ పనితీరుకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడారు. సర్జికల్ దాడుల తరువాత చొరబాట్లు 45శాతానికి పైగా తగ్గాయని చెప్పారు. దీని ద్వారా సర్జికల్ దాడులు పూర్తిగా సఫలం అయ్యాయని చెప్పవచ్చని ఆయన అన్నారు. భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకుని హతమార్చాయని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. జమ్ము కాశ్మీర్ లో శాంతి నెలకొల్పేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూడకుండా అక్కడ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ  కార్యక్రమాల వల్ల జమ్ము-కాశ్మీర్ లో తీవ్రవాదం  తగ్గుముఖం పట్టిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగైందని రాజ్ నాథ్ వెళ్లడించారు. గతంలో ఎన్నడూ లేనంతగా పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here