ఆటపైనే దృష్టిపెట్టానంటున్న కోహ్లీ

0
69

భారత క్రికెట్ జట్టులోని లుకలుకలపై కెప్టన్ విరాట్ కోహ్లీ స్పందించారు. క్రికెటర్ గా తాను పూర్తిగానే ఆటపైనే దృష్టిపెట్టినట్టు కోహ్లీ చెప్తున్నాడు. కెప్టెన్ కోహ్లీకి, కోచ్ కుంబ్లేకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు బయటపట్టతరువాత మొదటిసారిగా కోహ్లి దీనిపై స్పందించాడు. తాను ఇతర వ్యవహారలను పట్టించుకోవడం లేదని కేవలం ఆటపైనే దృష్టిపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. జట్టులోని ఆటగాళ్లంతో ఫిట్ గా ఉన్నారని పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పాడు. కోచ్ కుంబ్లేతో ఎటువంటి విభేదాలు లేవని విరాట్ చెప్తున్నాడు. ఆయనతో కలిసి  పనిచేయడం సంతోషంగా ఉంటుందన్నాడు. పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోబోమని అన్నాడు. పాకిస్థాన్ జట్టు ఎప్పుడైనా అధ్బుతాలు చేయగలదని విరాట్ చెప్తున్నాడు. ఫీల్డ్ లో ధోని సలహాలు వెలకట్టలేనివని విరాట్ చెప్పాడు. కోచ్ కుంబ్లేతో ఉన్న విభేదాల నేపధ్యంలో కుంబ్లేను సాగనంపేందుకే బీసీసీఐ  నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్న నేపధ్యంలో కోహ్లీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. కోహ్లీ ఆటను కాకుండా ఇతర వ్యవహారాల్లో ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు కనిపిస్తోందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోహ్లీ ఈ వివరణ ఇచ్చాడు. అటు భారత క్రికెట్ లో స్టార్ క్రికెటర్ల ఆగడాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయి. జట్టులో అందరినీ సమానంగా చూడడం లేదని ఎక్కడా లేని విధంగా జట్టులోని స్టార్ ఆటగాళ్ల పెత్తనం మితిమీరిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇంగ్లాడ్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫిలో అడుతున్న భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడుతోంది. కీలకమైన ఈ మ్యాచ్ ముందు రేగిన దుమారం పై  క్రికెట్ అభిమానులు కలవర పడుతున్నారు. కోచ్ కు కెప్టెన్ కు మధ్య పెరిగిన దూరం మ్యాచ్ పడకుండా చూడాలని ముందు ఆట పై దృష్టిపెట్టాలని పలువురు సూచించిన నేపధ్యంలో ప్రస్తుతం తన దృష్టి ఆటపైనే ఉందని, ఇతర విషయాలను పట్టించుకోవడం లేదని కోహ్లి ప్రకటించాడు. ఆదివారం జరిగే కీలక మ్యాచ్ లో పాకిస్థాన్ దుమ్ము దులపాలను సగటు క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here