నాడు వెలేశారు-నేడు నెత్తిన పెట్టుకున్నారు

0
53

మొన్నటి వరకు ఆ కుటుంబాన్ని గ్రామస్థులు వెలేశారు. ఆ ఇంటికి ఎవరూ వచ్చేవారు కాదు. ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా వేధించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు అదే కుటుంబాన్ని గ్రామస్థులు నెత్తిన పెట్టుకుంటున్నారు.  ఆ ఇంటివారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి స్వగ్రామానికి చేరుకున్న గోపాల కృష్ణకు  ఘన స్వాగతం లభించింది. మేళతాళాలతో ఊరేగింపుగా ఆయన్ను గ్రామంలోకి తీసుకుని వచ్చారు. తెలుగు మీడియంలో చదివి తెలుగు ఆఫ్షన్ ను ఎంపిక చేసుకుని మూడో ర్యాంకు సాధించి సత్తా చాటిన గోపాల కృష్ణ స్వగ్రామానికి చేరుకున్నారు.
స్వగ్రామానికి వచ్చే ముందు గోపాలకృష్ణ పలాసలోని గాంధీ,అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడి నుండి స్వగ్రామం పారసంబకు వచ్చారు. గ్రామస్థులు మేళతాళాలతో ఆయన్ను ఊరోగింపుగా తీసుకుని వచ్చారు. అడుగడుగునా ఆయనతో కలచాలనం చేసేందుకు  గ్రామంలోని యువతీ యువకులు పోటీలు పడ్డారు. ఒక్కప్పుడు గ్రామంలో ఆయన్ను పలకరించిన పాపాన పోలేదు. ఆయనతో పాటుగా వారి కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేశారు. గోపాలకృష్ణ తండ్రి చిన్న కులానికి చెందిన వారి ఇంట్లో పెళ్లి భోజనం చేశారనే కారణంగా ఆ కుటుంబం వెలికి గురైంది. వెనకబడిన కులానికి చెందిన గోపాలకృష్ణ కుటుంబం ఎస్.సిల ఇంట్లో  భోజనం చేయడంతో వీరిని వెలేశారు. ఇప్పుడు అదే గ్రామస్థులు గోపాలకృష్ణకు స్వాగతం పలికేందుకు పోటీలు పడ్డారు. ఇంటికి చేరుకున్న ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తల్లితండ్రులను చూస భోరున విలపించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here