సినిమాల నుండి తప్పుకుంటా:కమలాసన్

0
52

చిత్ర పరిశ్రమ నుండి తాను తప్పుకుంటానంటూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ హెచ్చరించారు. సినీ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ పన్ను విధించడం పై కమలాసన్ నిరసన వ్యక్తం చేశారు. పన్ను రేటును కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని లేకుంటే తాను సినీ పరిశ్రమ నుండి తప్పుకుంటానని అన్నారు. చెన్నైలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జీఎస్టీ పన్ను విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను ను 12 లేదా 15 శాతానికి తగ్గించాలని కమలాసన్ డిమాండ్ చేశారు. జీఎస్టీ పన్ను విధానానికి తాము వ్యతిరేకం కాదని అయితే సినీ పరిశ్రమపై విధుస్తున్న పన్ను సహేతుకంగా లేదన్నారు. అంతర్జాతీయ చిత్రాలను, ప్రాంతీయ చిత్రాలను ఒకే గాటన కట్టేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అంతర్జాకీయ సినిమాలతో సమానంగా ప్రాంతీయ చిత్రాలపై కూడా పన్నును విధించడం వల్ల చిన్న చిత్రాలు పూర్తిగా దెబ్బతింటాయని కమలాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశీయ సినిమాలకు చిన్న చిత్రాలే బలమని అటువంటి వాటిపై ఇంత పెద్ద మొత్తంలో పన్నును విధించడం వల్ల ఈ చిత్రాలు దారుణంగా దెబ్బతింటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పన్ను విధానాన్ని కమల్ హాసన్ తప్పు పట్టారు. ఇష్టం వచ్చినట్టుగా పన్నులు వేయడానికి ఇదేమైనా ఈస్ట్ ఇండియా కంపెనీనా అని ఆయన ప్రశ్నించారు. చలన చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న తాను చిత్ర పరిశ్రమ కోసం  పోరడతానని దీనికోసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా మని అన్నారు. సినీ పరిశ్రమపై విధించిన పన్ను విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఆయన కోరారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here