సరిహద్దుల్లో తిష్ట వేసిన ఉగ్రమూకలు-చొరబాటుకు యత్నాలు

భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు 150 మందికి పైగా తీవ్రవాదులు సరిహద్దుల్లో తిష్టవేశారని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన వీరంతా శిక్షణ తీసుకుని భారత్ లో ఉగ్రకార్యకలాపాలను నిర్వహించేందుకు భారత్-పాక్ సరిహద్దుల్లో కాచుకుని కూర్చున్నారని అవకాశం చిక్కిన వెంటనే వీరంతా భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని సైనిక నిఘా వర్గాల సమాచారం. వీరందరికీ తీవ్ర వాద సంస్థ హిజ్బుల్ శిక్షణ ఇచ్చిందని భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఈ ఉగ్ర మూకలు సిద్ధపడుతున్నట్టు సమాచారం. నిఘా సమాచారంతో సరిహద్దుల్లో మరింత నిఘాను పెంచారు. సరిహద్దు భద్రతా  దళాన్ని అప్రమత్తం చేశారు. ఊగ్రవాదులను భారత్ లోకి పంపే క్రమంలో పాకిస్థాన్ భారత్ భూబాగంపైకి కాల్పులు జరపడం పరిపాటి. ఈ నేపధ్యంలో సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. భారత్ లోకి చొరబడేందుకు అవకాశం కోసం చూస్తున్న తీవ్రవాదులు తమకు అనువుగా ఉండే ప్రాంతాల్లో మోహరించినట్టు తెలుస్తోంది. హిజ్బుల్ కు చెందిన తీవ్రవాద ముఠా ఒకటి శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఈ ముఠ తీసుకున్న తీసుకున్న గ్రూప్ ఫొటో కూడా నిఘా వర్గాలకు  చిక్కింది.
భారత్ లోకి తీవ్రవాదులు ఏదో రకంగా చొరబడుతూనే ఉన్నారు. రక్షణ కంటె లేని ప్రాంతాల గుండా జవాన్ల కన్ను గప్పి భారత భూబాగంలోకి వస్తూ ఇక్కడ విధ్వంసానికి తెగబడుతున్నారు. ఇంత భారీ ఎత్తున ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నాలు చేయడం అరుదని నిఘా  వర్గాలు చెప్తున్నాయి.  చిన్న చిన్న బృందాలుగా భారత్ లోకి తీవ్రవాదులు వస్తున్నా ఓకే సారి 150 మందికి పైగా తీవ్రవాదులు సరిహద్దుల్లో తిష్ట వేయడం పై భారత్ ను కలవరపెడుతోంది. తీవ్రవాదులకు అన్ని రకాలుగా సహాయపడుతున్న పాకిస్థాన్ సైన్యం వారిని సరిహద్దులను దాటించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. భారత్ పోస్టులపై కాల్పులకు దిగి సైనికుల దృష్టిని మరల్చడం ద్వారా తీవ్రవాదులను సరిహద్దు కంటెను దాటించేందుకు పాకిస్థాన్ సైనికులు నిత్యం ప్రయత్నిస్తూ ఉన్నారు.
నియంత్రణ రేఖకు సమీపంలోనే పెద్ద సంఖ్యలో తీవ్రవాద శిక్షణా శిభిరాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. తాము తీవ్రవాదులకు ఎటువంటి సహాయం అందిచడం లేదని బొంకుతున్న పాకిస్థాన్ వారికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారలను అందచేస్తున్నది. భారత్ లో అలజడి రేపేందుకు కాచుకుని కూర్చున్న ఉగ్రమూకలకు పాకిస్థాన్ సైన్య సహకారం పూర్తిగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *