దర్శక రత్న దాసరి మృతి

తెలుగు చిత్ర సీమ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. దర్శకుడు,రచయిత,నటుడు,కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు (75) మంగళవారం రాత్రి 7.00 గంటల సమయంలో  దాసరి నారాయణ రావు తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చనిపోయారు. దాసరి నారాయణ రావు మృతి చెందిన విషయాన్ని ఆస్పత్ర వర్గాలు వెళ్లడించాయి.

 • తెలుగు చిత్ర సీమకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకుని వచ్చిన అతి కొద్ది మందిలో దాసరి ఒకరు.
 • అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న దాసరి.
 • మొత్తం 151 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి.
 • 200 పై చిలుకు చిత్రాలకు మాటలను రాసిన దాసరి నారాయణ రావు.
 • పశ్మిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన దాసరి.
 • తారక ప్రభు బ్యానర్ పేరిట చిత్రాలు నిర్మించిన దాసరి.
 • సొంత బ్యానర్ పై 53 చిత్రాలను నిర్మించిన దాసరి.
 • అనేక సందేశాత్మక చిత్రాలను తీసిన దాసరి.
 • అనేక హిట్ సినిమాలను నిర్మించిన దాసరి.
 • అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు ఇద్దరితోనూ అనేక సినిమాలు చేసిన దాసరి.
 • ప్రేమాభిషేకం, బెబ్బులి పులి లాంటి హిట్ చిత్రాల నిర్మాత
 • రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన దాసరి.
 • మన్మోహన్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన దాసరి.
 • ఉదయం పత్రక ద్వారా సంచలనం సృష్టించిన దాసరి నారాయణ రావు.
 • దాసరి మృతిపై పలువురు సంతాపం.
 • దాసరి మృతి పై సంతాపం వెలిబుచ్చిన కేసీఆర్, చంద్రబాబు నాయుడు.
 • రాష్ట్ర ప్రభుత్వ  అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.

 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *