రాళ్ల దాడులకు బుల్లెట్లతో జవాబు..!

జమ్ము కాశ్మీర్ లో సైనికులపై రాళ్లు రువ్వుతూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై ఇక కఠిన చర్యలకు సైన్యం సిద్దపుడుతోంది. ఇప్పటివరకు రాళ్లు రువ్వుతున్న ప్రజల పట్ల సంయవనంతో వ్యవహరిస్తూ వస్తున్న సైన్యం ఇక నుండి వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు సమాచారం. ఇక నుండి రాళ్లు రువ్వేవారిపై కఠిన చర్యలకు సైన్యం సిద్ధపడుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై చర్య తీసుకునే అధికారం సైన్యానికి ఉండదు. వారిని అదుపులోకి తీసుకున్నా వెంటనే స్థానిక పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది. అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో ప్రవేశపెట్టడం, ఘటనపై దర్యాప్తు చేసే బాధ్యత స్థానిక పోలీసులదే. జమ్ము కాశ్మీర్ లో కూడా ఇదే తరహాలో ఇప్పటివరకు సైనికులు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏదైనా ఆపరేషన్ నిర్వహించినపుడు స్థానికులు సైన్యంపై రాళ్లదాడులు చేసినా సైన్యం సాధారణ పౌరులను ఆ ప్రాంతనుండి పంపిచే బాధ్యతను స్థానిక పోలీసులకు అప్పగిస్తూ వస్తోంది. మరీ పరిస్థితి అదుపుతప్పిన కొన్ని సందర్భాల్లో మాత్రమే సైనికులు కాల్పులకు దిగుతున్నారు. దీన్ని అదనుగా చేసుకుని తరచూ సైనికులపై రాళ్లదాడులు ఎక్కువయ్యాయి. ఇటీవల కాలంలో సైనికులకపై దాడులకు తెబడుతున్న సంఘటనలు నిత్యం  జరుగుతూనే ఉన్నాయి.
ఈ పరిస్థితుల నేపధ్యంలో సైనికులపై దాడులకు తెగబడేవారిని ఉపేక్షించవద్దని సైనికాధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆర్మీ చీప్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. రాళ్లదాడులకు పాల్పడుతున్న వారిని ఏమీ అనవద్దని చూస్తూ ఊరుకోమని తన సైనికులకు చెప్పలేనంటూ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రావత్ స్పష్టం చేయడాన్ని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో రాళ్లదాడులకు పాల్పడేవారిపై సైన్యం కఠిన చర్యలకు సిద్ధపడుతున్నట్టే కనిపిస్తోంది. దీనితో పాటుగా రావత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సైనికులంటే భయం లేకపోతే పరిస్థితులు దారుణంగా మారతాయని ఆయన చేసిన హెచ్చరికలు కూడా సైనికులు ఇక ఎంత మాత్రం సంయవనంతో వ్యవహరించరని చెప్పకనే చెప్పారు.
ఇటీవల కాలంలో జమ్ము-కాశ్మీర్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. సైనికులపై దాడులు గణనీయంగా పెరిగాయి. సైనికులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. వారికి స్థానికుల నుండి మద్దతు లభిస్తోంది. సైన్యం తీవ్రవాదులపై చర్యలు తీసుకునే సమయంలో స్థానికులు ఉగ్రమూకలకు అండగా నిలబడుతున్నాయి. సైనికులపై రాళ్లు రువ్వుతూ వారిని గాయపరుస్తున్నాయి. సైనికులు ఈ సందర్భల్లో సంయవనం పాటిస్తున్నారు. పౌరులపై కాల్పులకు దిగరాదన్న ఆదేశాలు మేరకు వారి రాళ్లదాడులను మౌనంగా భరిస్తున్నాయి. సైనికుల మౌనాన్ని కొంత మంది చేతకాని తనం గా జమ చేస్తూ మరిన్ని దాడులకు తెగబడుతున్న నేపధ్యంలో ఇక ఉపేక్షించి లాభం లేదని సైనికాధికారులు నిర్ణయించుుకున్నట్టుగానే కనిపిస్తోంది. రాళ్లకు బల్లెట్ తోనే జవాబు చెప్పే రోజులు దగ్గర్లోనే కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *