స్టూడియో -ఎన్ ఛానల్ లో వరంగల్ జిల్లా విలేకరి ప్రకాష్ మరణించారు. గతంలో జీ టీవీ కెమేరామన్ గా ఉన్న ప్రకాష్ ఆ తరువాత స్టూడియో-ఎన్ లో రిపోర్టర్ గా చేరాడు. వేసవి సెలవలకు కుటుంబంతో కలిసి కేరళా ట్రప్ కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో చనిపోయారు. కేరళలోని త్రిశూర్ లో ప్రకాష్ కు తీవ్ర గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయి మరణించారు. వేసవి సెలవలకు సరదాగా టూర్ కి వెళ్లిన ప్రకాష్ విగతజీవిగా మారాడు. ప్రకాశ్ మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు సానుభూతి వ్యక్తం చేశారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఆయన సరదాగా టూర్ కి వెళ్లిన సమయంలో ఈ విషాథం చోటుచేసుకోవడం పట్ల పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశ్ తో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేస్తుకున్నారు.