ఒక దొంగ స్వామి ఆవయవాన్ని యువతి కోసేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని కొల్లామ్ పన్మన ఆశ్రమానికి చెందిన స్వామి గణేశానంద గత ఏనిమిది సంవత్సరాలుగా ఒక యువతిని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ యువతిని లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మొదటి సారిగా తనకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ దొంగ స్వామి అత్యాచారానికి పాల్పడ్డాడని అప్పటి నుండి నిత్యం తనపై అఘాయిత్యం చేయిస్తూనే ఉన్నాడని ఆ యువతి వాపోయింది. తన తల్లిని కలుసుకునే నెపంతో తన ఇంటికి వస్తూ తనపై అఘాయిత్యానికి పాల్పడూ వస్తున్నాడని ఆ యువతి పేర్కొంది. ప్రస్తుతం లా చదువుతున్న సదరు యువతి శక్రవారం తనపై మరోసారి అత్యాచారానికి ప్రయత్నించిన దొంగ స్వామి ఆవయవాన్ని పదునైన ఆయుధంతో కోసేసింది.
తాను దొంగ స్వామిజి ఆవయవాన్ని కోసేసినట్టు సదరు యువతి పోలీసులకు వచ్చి చెప్పడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా అతని ఆగడాలను భరిస్తూ వచ్చానని ఇక తప్పని పరిస్థితుల్లో ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులకు ఆ యువతి వివరించింది. స్వామీజి తనను దారుణంగా హింసించే వాడని ఆ యువతి పోలీసులకు వివరించింది. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఆశ్రమంలో ఇతన్ని గురించి వాకబు చేయగా 15 సంవత్సరాల క్రితమే అతను ఆశ్రమం నుండి వెళ్లిపోయినట్టు ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు. తమకు ఆ దొంగ స్వామికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.