పోలీసులతో కేసీఆర్ చారిత్రాత్మక భేటీ

police

  • పోలీసు శాఖ పై సీఎం ప్రసంశల జల్లు
  • భారీ నజరానాలు
  • పోలీసులకు సీఎం దిశా నిర్థేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖ లోని వివిధ హోదాలకు చెందిన 1500 మందికి పైగా అధికారులతో సమావేశమయ్యారు. ఎస్.ఐ స్థాయి అధికారుల నుండి డీజీ స్థాయి వరకు పోలీసు అధికారులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పోలీసులకు దిశానిర్ధేశం చేయడంతో పాటుగా పోలీసు శాఖ ఎదుర్కొంటున్న సమయ్యలపై దృష్టి పెట్టారు. పోలీసులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మాదాపూర్ లో హెచ్ఐసీసీలో ముఖ్యమంత్రి అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి పైరవీలకు ఆస్కారం లేకుండా పోలీసుల ప్రయోషన్ల క్రమపద్దతిలో జరగాలన్నారు. పోలీస్ ఉద్యోగి రిటైర్ అయ్యేరోజుకే పెన్షన్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి కావాలన్నారు. మహిళా పోలీసులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణాలో శాంతి భద్రతలను పూర్తిగా అదుపులో ఉంచుతున్న పోలీసు అధికారులను సీఎం ప్రశంసించారు. శాంతి భ్రత్రతలు మెరుగ్గా ఉన్నప్పుడే ఇతర కార్యకలాపాలవైపు ప్రభుత్వం దృష్టి సారించగలుగుతుందన్నారు. పోలీసులు శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడకూడదన్నారు. వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. కొత్తగా వాహనాల కొనుగోలుకు 5 వందల కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు సీఎం వెళ్లడించారు. ఎస్.ఐ., సీఐ స్థాయి అధికారులు ఎప్పడికప్పుడు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సీఎం సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడంతో పాటుగా నేరాలు జరుగుతున్న తీరును గమనిస్తూ తమని తాను అప్ డేట్ చేసుకోవాలన్నారు. తాను చెప్పేదే సరైందనే భావనతో కొంత మంది పోలీసులుంటారని ఎదుటివారు చెప్పేది కూడా వినాలని సీఎం సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్ల సమస్య తీవ్ర మవుతుందని, శాంతి భద్రతలు కరువుతాయని చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేశారని అయితే వాటన్నింటిని మన పోలీసులు తప్పని నిరూపించారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలున్నాయని సీఎం అన్నారు. తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఆయన కితాబునిచ్చారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *