కామేడీ పేరుతో బూతు…జబర్థస్త్,పటాస్ ల పై కేసు

కామెడీ పేరుతో ప్రసారం అవుతున్న బూతును అడ్డుకోవాలంటూ ఓ వ్యక్తి మానవహక్కుల సంఘాన్ని, పోలీసులను ఆశ్రయించాడు. టీవీల్లో ప్రసారం అవుతున్న రెండుకార్యక్రమాలపై ఆయన ఫిర్యాదు చేశాడు. హాస్యం పేరుతో ద్వందార్థాల మాటలను విచ్చలవిడిగా ప్రయోగిస్తున్నారని, మహిళలను, బాలలను కించపర్చేవిధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీలో ప్రసారం అవుతున్న జబర్ధస్,  పటాస్ కార్యక్రమాలు పూర్తిగా బూతు మయంగా మారిపోయాయని సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యుడు దివాకర్ ఆరోపిస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలను వెంటనే అడ్డుకోవాలంటూ ఆయన మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లతో పాటుగా కార్యక్రమ రూపకర్తలు, కార్యక్రమంలో పాల్గొంటున్న వారిపై కూడా ఫిర్యాదు చేశారు. పూర్తిగా అసభ్య పదజాలంతో నిండిపోయిన ఈ కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. అటు జబర్థస్త్ కార్యక్రమానికి అతిధులుగా ఉన్న నాగబాబు, రోజాలపై కూడా దివాకర్ ఫిర్యాదు చేశారు.  వీరిద్దరు బూతును పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జబర్దస్త్, పటాస్ కార్యక్రమాలపై గతంలోనూ ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. కామెడీ పేరుతో బూతును ప్రసారం చేస్తున్నారనేది వారి ఆరోపణ. మగవాళ్లకి ఆడవేషాలు వేస్తూ అత్యంత జుగుస్పాకరంగా మాట్లాడుతూ బూతులు, ద్వందార్థాల మాటలను మాట్లాడుతున్నారనే విమర్శలున్నాయి. ఆడవారినికి కించపర్చేవిగా, చిన్న పిల్లలను కూడా అత్యంత దారుణంగా చూపించడంపై విమర్శలు వచ్చాయి. చిన్న పిల్లలతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడించడం అన్నీ ద్వందార్థాల మాటలే ఎక్కువగా వినిపించే ఈ షో లపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. ఈ కార్యక్రమాలపై మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. మహిళలను కించపర్చే విధంగా ఈ షోలలో చూపిస్తున్నారని వివాహేతర సంబంధాలు అత్యంత కామన్ అన్నట్టుగా ఈ షోలలో చూపిస్తూ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఆడవారిని ఆట వస్తువులుగా చిత్రీకరించడం పై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో పిల్లలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చూసే పరిస్థితి లేదని వారంటున్నారు.
జబర్థస్త్, పటాస్ కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలను మించిన బూతు ఇప్పుడు టీవీల్లోనే ప్రసారం అవుతోందని వారు అంటున్నారు. కామెడీ అంటే ద్వందార్థాలు అనే విధంగా మారిపోయిందని వారు వాపోతున్నారు. ఎన్ని విమర్శలున్నప్పటికీ ఈ రెండు కార్యక్రమాల టీఆర్పీ రేటింగ్ లు  చాలా ఎక్కువ ఉండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *