ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లను హ్యాక్ చేస్తూ దేశాలకు దేశాలను వణికిస్తున్న ర్యాన్సమ్ వేర్ సైబర్ వైరస్ ప్రభావం తెలంగాణ సచివాలయం పై కూడా పడింది. సచివాలయంలో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యల నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. దీనితో సచివాలయం మొత్తం ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిల్చిపోయాయి. ఇంటర్నెట్ సేవలు నిల్చిపోయినప్పటికీ పనులు పూర్తిగా ఆగిపోకుండా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. ఇంటర్నెట్ నిల్చిపోవడం వల్ల ఎంత మేరకు పనులకు ఆటకం కలిగింది అనే విషయం తెలియాల్సి ఉంది. తెలంగాణ సచివాలయంలో ఎప్పటి నుండి తిరిగి ఇంటర్నెట్ సేవలను పునరుద్దరిస్తారనే సంగతి త్వరలోనే వెళ్లడిస్తామని అధికారులు చెప్పార.