ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన తీవ్రవాద సంస్థ ఐసిస్… ఐసీస్ ఆనవాళ్లు హైదరాబాద్ లో కనిపించడం నగరవాసులను కలవర పెడుతోంది. ఐసీసీ భూతంపై ఒక ప్రముఖ ఛానల్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్ లో నమ్మలేని నిజాలు బయపడ్డాయి. భారత్ లో ఎక్కడ తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లోనే బయటపడిన సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా ఐసిస్ లాంటి అత్యంత ప్రమాదకర తీవ్రవాద సంస్థకు చెందిన కార్యకలాపాలకు కూడా హైదరాబాద్ కేంద్రంగా మారడం వెన్నులో వణు తెప్పిస్తోంది. నగరానికి కొంత మంది ఐసిస్ లో పనిచేస్తున్న సంగతి గతంలోనూ వెలుగులేకి వచ్చినప్పటికీ వారందరూ సిరియా, ఇరాక్ యుద్ధ క్రేత్రాల్లో పాల్గొన్నారు. ఐసిస్ తన కార్యకలాపాలను భారత్ లో విస్తరించలేదని లేమ్మకాన్ని వమ్ముచేస్తూ భారత్ లోనూ ఐసిస్ తన కార్యకలాపాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసంగానూ భారీగా రిక్రూట్ మెంట్ లకు కూడా తెరతీస్తోంది.
- ఐసిస్ కార్యకలాపాలు పాత నగరంలో సాగుతున్నాయి.
- ఐసిస్ సానుభూతిపరులు చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఉన్నారు.
- ఐసిస్ తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు కొంతమంది బహిరంగంగానే చేస్తున్నార.
- గతంలో రెండు సార్లు పోలీసులకు పట్టుబడ్డ అబ్దుల్ బాసిత్ నగరంలో ఐసిసి కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్నట్టు సమాచారం.
- బాసిన్ స్వస్థలం మిర్యాలగూడ.
- బాసిత్ తో పాటుగా కొంత మంది నేరుగా సిరియాలోని ఐసిస్ నేతలకు టచ్ లో ఉంటున్నారు.
- ఇస్లాం రాజ్య స్థాపనే వీరి లక్ష్యం.
- ఇస్లాం రాజ్య స్థాపన కోసం ఎంతకైన తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటన.
- ఇస్లాం వ్యతిరేకులను తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు.
- యుద్ధ క్షేత్రానికి వెళ్లడానికి రెడీ అంటున్న ఐసిస్ సానుభూతి పరులు.
- మతమౌడ్యం నూరిపోస్తున్న ఐసిస్.
- రిక్రూట్ మెంట్ కు వేదికగా మారుతున్న ఫేస్ బుక్, వాట్సప్ లాంటి సమాజిక మాధ్యమాలు.
- ప్రపంచ వ్యాప్తంగా షరియా చట్టం అమలు చేయాలనేదే ఐసిస్ విధానం.
- భారత్ లో షరియాను అమలు పర్చని వారు మతం మారడమో, ప్రత్యేక పన్నులు కట్టడమో, చావడమో చేయాలంటూ ప్రచారం.
- పోలీసులు అరెస్టు చేస్తున్నా బయటకి వస్తున్న ఐసిస్ సానుభూతి పరులు.
- స్థానిక రాజకీయాలను తమకు అనుకూలంగా మల్చుకుంటున్న ఐసిస్ సానుభూతి పరులు.
- కలవరపాటుకు గురిచేస్తున్న ఐసిస్ కార్యకలాపాలు.
- చాప కింద నీరుగా విస్తరిస్తున్న ఐసిస్.
- ఇప్పటికే కాశ్మీర్ లో కనిపిస్తున్న ఐసిస్ జెండాలు.
- దేశవ్యాప్తంగా పేలుళ్లకు కూడా వెనకాడమంటూ ఐసిస్ ప్రకటన.
- మత పరంగా సున్నితంగా ఉండే హైదరాబాద్ ను సేఫ్ అడ్డాగా మార్చుకుంటున్న ముష్కరులు.
- పెరుగుతున్న కార్యకలాపాలపై పోలీసుల నిఘా.
- భయపడాల్సింది లేదంటున్న పోలీసులు.