ప్లే ఆఫ్ కు సన్ రైజర్స్

ఐపీఎల్ పదో సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ ప్లేఆఫ్  కు అర్హత సాధించింది.  కీలకమైన మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ ను ఓడించడం ద్వారా సన్ రైజర్స్ ప్లేఆప్ బెర్త్ లో స్థానం సంపాదించుకుంది. ఈ విజయంతో 17 పాయింట్లు సాధించిన సన్ రైజర్స్ పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ కు చేరాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు సమస్టిగా రాణించి విజయాన్ని కైవసం చేసుకుంది. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో గుజరాత్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో అదరగొట్టిన స్థానిక ఆటగాడు సిరాజ్ కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరాజ్ నాలుగు వికెట్లను పడగొట్టాడు. సిరాజ్ ధాటికి గుజరాత్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. 155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు రెండు వికెట్లను కోల్పోయి లక్షాన్ని సాధించింది.
గుజరాత్ ఇచ్చిన 155 పరుగుల లక్ష్యసాధనలో హైదరాబాద్ తొలుత తడబడింది. శిఖర్ ధావన్ , హెన్రిక్స్ లు తక్కువ స్కోర్ కే పెవీలియన్ కు చేరుకున్నప్పటికీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, శంకర్ లు వికెట్ నష్టపోకుండా నిర్దేశిత లక్షాన్ని పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *