మహా వీరుడు రాణా ప్రతాప్

పేరు-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్)
జన్మదినం-9 మే,1540
జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్
పుణ్యతిది-29 జనవరి,1597
తండ్రి – మహారణా ఉదయ్ సింహ్ జి
తల్లి-రాణి జీవత్ కాంవర్ జి
రాజ్య సీమా-మేవాడ్
శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు)
వంశం –సూర్యవంశం
రాజవంశం-సిసోడియ రాజపుత్రులు
ధార్మికం-హిందూధర్మం
ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం
రాజధాని-ఉదయ్ పూర్

 • శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.
 • మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.
 • డిల్లీ చక్రవర్తి   అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించితన  కాళ్ళ మీద పడుతే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తానని చెప్పినప్పటికీ తనకు ఆత్మగౌరవమే ముఖ్యమని రాణా ప్రతాప్ అన్నాట్టు కథనం.
 • 20 వేల మంది సైనికులతో అంతకు నాలుగు రెట్లు అధికంగా ఉన్న అక్బర్ సైన్యాన్ని ఎదుర్కొన్న  హల్దిఘాట్ యుద్దంలో ఎదుర్కొన్నా రాణా ప్రతాప్.
 • మహారణా ప్రతాప్ ఇష్టమైన గుర్రం చేతకు పేరు మీదుగా ఒక గుడి కూడా ఉంది.
 • హల్ది ఘాట్ యుద్దం జరిగి వందల  సంవత్సరాల తరువాత కూడా అక్కడి నెలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది.
 • మహారణా ప్రతాప్ సింహ్ తో పాటుగా  ఆయన సైన్యం కూడా వీరత్వానికి చిహ్నం.  8000 మంది రాజపుత్రు వీరులు 60 వేల మంది  మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48వేల  మంది చనిపోయారు.ఇందులో 8వేల  మంది రాజపుత్రులు కాగా  40 వేల మంది మొఘలులు
 • హల్ది ఘాట్ యుద్ధంలో మొగలుల చేతిలో  మహారణా ప్రతాప్ సింగ్  ఓడిపోయినప్పటికీ ఆయన చేసిన పోరాటంతో ప్రత్యర్థుల మనసులను కూడా గెల్చుకున్నాడు. యుద్ధంలో మహారాణా ప్రతాప్ సింగ్  చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.
 • హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి బాణాలతో చేసిన గెరిల్లా  తరహా యుద్ధం ప్రపంచంలోనే ప్రసిద్ది చెందింది. వియత్నం యుద్ధ సమయంలో ఆదేశం వారు ఈ తరహా యుద్ధం తోనే అమెరికాను దెబ్బతీశారు.
 • రాణా గుర్రం అయిన చేతక్ మహారణాను 26 అడుగుల కందకాన్ని దూకి చనిపోయిందట. అప్పటికే దాని కాలు ఒకటి విరిగిపోయి ఉన్నప్పటికీ చేతక్ 26 అడుగుల దూరాన్ని దూకి ప్రాణాలు విడిచింది.
 • చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి మహారాణాతో పాటుగా  అంతా ఎత్తులో గాలిలో ఎగిరేదట.
 • మహారణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన భూభాగంలో   85% తిరిగి గెల్చుకున్నాడు.
 •  మహారణా ప్రతాప్  బరువు 110 కిలోలు. అతని పొడవు 7’5’’. రెండు వైపులా పదునున్న  కత్తి, 80 కిలోల ఈటె ఎప్పుడూ ఆయనతోనే ఉండేవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *