పుత్ర శోకం…

చేతికి అంది వచ్చిన కొడుకు తండ్రి కళ్ల ఎదుటే కన్ను మూస్తే… ఆ తండ్రి పడే వేదన వర్ణానాతీతం. ఏపీ మంత్రి నారాయణ ప్రస్తుతం ఆ బాధను అనుభవిస్తుండా ఇంతుకు ముందు నటులు కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, క్రికెటర్ అజారుద్దీన్, మాజీ మంత్రి కోమటిరెడ్డ ివెంకట్ రెడ్డిలు ఇదే తరహా పుత్రశోకాన్ని అనుభవించారు. వీరందరి పుత్రులు చిన్న వయసులోనే కన్నవాళ్లను వదిలి పోయారు. మితిమీరిన వేగమే వీరందరినీ బలితీసుకుంది. కోటాశ్రీనివాస రావు, బాబుమోహన్, అజారుద్దీన్ ల తనయులు బైక్ ప్రమాదంలో చనిపోగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పై ప్రమాదాలు అన్నీ అవుటర్ రింగ్ రోడ్డుపైనే జరగ్గా మంత్రి నారాయణ తనయుడు మాత్రం జూబ్లీహిల్స్ లో జరిగిన కారు ప్రమాదంలో చనిపోయాడు. మూడు పదులు నిండకుండాలో తల్లి దండ్రులకు శోకాన్ని మిగిల్చిపోయిన తనయులను తల్చుకుంటూ వారు పడుతున్న మానసిక క్షోభ అంచానాలకు అందనిది.
గాలితో పోటీ పడుతూ రివ్వున దూసుకుని పోతున్న యువత ప్రమాదాలను కొని తెచ్చుకుంటోంది. అందుబాటులోకి వచ్చిన అత్యున్న శ్రేణి బైక్ లు కార్లలో వేగంగా దూసుకునిపోతూ మజాను వెతుక్కుంటున్న యువత దాని వెనకే పొంచి ఉన్న ప్రమాదాలను మాత్రం గుర్తించడం లేదు. ప్రపంచ స్థాయి రేసింగ్  బైక్ లు, కార్లు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. క్షణాల్లో వందల కిలోమీటర్ల స్పీడ్ ను అందుకునే ఈ వాహనాలపై వాయు వేగంతో దూసుకుని పోతున్న వారు వాటిని నియంత్రించడంలో మాత్రం విఫలమవుతున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల వాహనాలు మన రోడ్లపైకి వచ్చినా మన రోడ్లు మాత్రం ఆ స్థాయి  ప్రమాణాలను ఇంకా అందుకోలేదు. ప్రమాదకరమ మలుపులను అంచానా వేయలేక ప్రాణాలు కోల్పోతున్నవారు కొందరైతే ఇతర వాహనాలు ఢీకొట్టి ప్రణాలు కోల్పోతున్న వారి మరికొందరు.  రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం, అలక్ష్యం, నిలభందనలు పాటించకపోవడమే. నూటికి 85 శాతం ప్రమాదాలు ఇదే కారణంగా నిపుణులు చేప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *