నెల్లూరుకు నిషిత్ మృతదేహం

10rip-gal1B10rip-gal1a 10rip-gal1D 10rip-gal1F

ఆంధ్రప్రదేశ్ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కుమారుడు నిషిత్ మృత దేహాన్ని నెల్లూరు కు తరలించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మంత్రి నారాయణ కుమారుడి మృతదేహానికి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో శవపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు నిషిత్ మృత దేహాన్ని అంబులెన్స్ లో నెల్లూరుకు తరలించారు. నిషీత్ తో పాటుగా మరణించిన అతని మిత్రుడు రవిచంద్ర మృతదేహాన్ని కూడా ఆయన కుటుంబ సభ్యులకు అందచేశారు. ఏపీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్‌రావు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఐ నేత నారాయణ, తెరాస నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.శ్రీనివాస్‌, తెలంగాణ తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎల్‌.రమణలతో పాటుగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నేతలు  అపోలో ఆస్పత్రికి వచ్చారు.