రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రికార్డుల మీద రికార్డులను సృష్టుస్తూ దూసుకుని పోతోంది.
- వేయు కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా బాహుబలి రికార్డులు సృష్టించింది.
- ఇంతకు ముందు ఏ భారతీయ సినిమా కూడా వేయికోట్ల మార్క్ ను అందుకోలేకపోయింది.
- ఇదే ఊపుతో బాహుబలి 1500 కోట్లను వసూలు చేసే అవకాశం ఉందని సినిమా వర్గాలు భావిస్తున్నాయి.
- బాహులి తొలి భాగం 650 కోట్ల వసూళ్లను రాబట్టగా రెండో భాగం ఇప్పటికే వేయి కోట్ల కలెక్షన్లు సాధించింది.
- బాహుబలి చిత్రం అన్ని విభాగాల్లోనూ రికార్డుల వరదను సృష్టిస్తోంది.
- బాహుబలి ట్రైలర్ నుండే సంచలనాలు రేపింది. ట్రైలర్ విడుదల అయిన వెంటనే కోట్లాది మంది దాన్ని చూడడం ద్వారా యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది.
- ప్రపంచ వ్యాప్తంగా 8వేలకు పైగా ధియోటర్లలో బాహుబలి -2 రిజీల్ అయింది. ఇది కూడా ఒక రికార్డే.
- భారత దేశంలోని 6వేల 5 వందల ధియేటర్లలో బాహుబలిని విడుదల చేశారు.
- విడుదల అయిన తొలి రోజే బాహుబలి వంద కోట్ల మార్క్ ను దాటేసింది.
- తొలిరోజు 121 కోట్ల రూపాయలను బాహుబలి వసూలు చేసింది.