వచ్చీ రాగానే అర్ణబ్ సంచలనం

తన వాగ్ధాటి ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ టీవీ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి ఆధ్వర్యంలో వస్తున్న రిపబ్లిక్ టీవీ వస్తునే సంచలనం రేపింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లూలూ ప్రసాద్ యాదవ్  పై అర్ణబ్ బాంబు పేల్చారు. పేరు గాంచిన గ్యాంగ్ స్టర్, తీహార్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న షహబుద్దీన్ తో లాలూ మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియో టేపులను రిపబ్లిక్ టీవీ ప్రసారం చేయడం కలకలం రేపుతోంది.
జైలు నుండి ,షహబుద్దీన్ లాలూకు సూచనలు ఇస్తున్నట్టుగా ఉన్న ఈ ఆడియో  టేపులు బీహార్ తో పాటుగా కేంద్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారాన్ని రేపాయి. లాలూ వెంటనే రాజకీయాల్లోనూండి తప్పుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ కు అక్రమాలకు పాల్పడడం కొత్తేం కాదని బీజేపీ పేర్కొంది. అటు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కానీ, ఇటు ఆర్జేడీ అధినేత కానీ ఈ టేపులపై స్పందించలేదు.
టైమ్స్ గ్రూప్ నుండి బయటకు వచ్చిన అర్ణబ్ రిపబ్లిక్ టీవీ పేరుతో ప్రారంభమైన టీవీ వచ్చీ రావడంతోనే సంచలనాలకు తెరతీసింది. అర్ణబ్ నేతృత్వంలో వచ్చిన ఈ ఛానల్ మరిన్ని సంచలన వార్తలను ప్రజల ముందుకు తెస్తుందని అర్ణబ్ ఇప్పటికే ప్రకటించారు.
లాలూ తనయుడు తేజ్‌ ప్రతాప్‌యాదవ్‌కు పాట్నాలో ఓ పెట్రోల్‌ పంపును 2011లో అక్రమంగా కేటాయించారని బీహార్‌కు చెందిన బీజేపీ నేత సుశీల్‌కుమార్‌ మోదీ ఆరోపణలు చేసిన కొద్ది గంటలకే ఆడియో క్లిప్పింగ్‌ బయటకు రావడంతో విపక్షాలు లాలూ, అధికార బీజేడీలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. క్లిప్పింగ్‌పై మాట్లాడిన సుశీల్‌.. లాలూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *