విషపు గ్యాప్ అంటూ విప్రోకు బెదిరింపు

దేశంలోని ప్రముఖ ఐటి సంస్థ విప్రోకు బెదిరింపు మెయిల్ వచ్చింది. క్యాంపస్ లోకి విషపూరిత గ్యాస్  పంపుతామనేది మెయిల్ సారాంశం. దీనితో అటు పోలీసులు, ఇటు విప్రో యాజమాన్యం అప్రమత్తం అయింది. దేశవ్యాప్తంగా విప్రో కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మే 25వ తేదీ లోగా తమకు 500 కోట్ల రూపాయలను మెయిల్ లో పంపిన లింక్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని లేని పక్షంలో విషపూరిత గ్యాస్ ను విప్రో క్యాంపస్ లోకి పంపుతామంటూ బెంగళూరులోని విప్రో కార్యాలయానికి  ఈ మెయిల్ వచ్చింది. దీనితో వెంటనే విప్రో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది బెదిరింపు మెయిల్ కాదని  తాము ఖచ్చితంగా అనుకున్నది చేస్తామంటూ మెయిల్ పేర్కొనడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
రమేశ్ అనే వ్యక్తి పేరు మీద ఈ మెయిల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. రిచిన్ అనే విషపూరిత డ్రగ్ ను విప్రో క్యాంపస్  లో వ్యాపించచేస్తామని ఇప్పటికే ఒక విప్రో కార్యాలయానికి రిచిన్ డ్రగ్  కవర్ ను పంపినట్టుగా ఆ  మెయిల్ లో పేర్కొన్నారు. ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారో తమకు తెలియదని విప్రో యాజమాన్యం పేర్కొంది. ఇప్పటికే తమ సంస్థకు చెందిన అన్ని కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని విప్రో సంస్థ  పేర్కొంది. ఈ బెదిరింపు మెయిల్ వల్ల తమ కార్యకలాపాలకు ఎటువంటి విఘాతం కలగలేదని విప్రో  స్పష్టం చేసింది.  పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *