సరిహద్దుల్లో అప్రకటిత యుద్ధం

     పాకిస్థాన్ మనతో అప్రకటిత యుద్ధం చేస్తోందా..ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దుల్లో ఒకటిగా పేరుగాంచిన భారత్-పాక్ సరహద్దుల్లో యుధ్దవాతావరణమే కనిపిస్తోంది. భారత భూబాగంలోకి చొచ్చుకుని వచ్చి మరీ ఇద్దరు జవాన్లను అత్యంత క్రూరంగా హత్యచేయడమే కాకుండా వారి తలలను నరికి తీసుకునిపోయిన పాక్ సైనికుల అకృత్యాలతు సరిహద్దు ప్రాంతం అట్టుడుగుతోంది. నిత్యం కాల్పుల శబ్దాలతో సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

  • పాకిస్థాన్ భారత్ తో అప్రకటిత యుద్ధం చేస్తోంది.
  • పాకిస్థాన్ సైనికులతో పాటుగా ఆ దేశం అన్ని విధాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్ర మూకలు భారత జవాన్లపై దాడులకు దిగుతూ యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
  • సైనికులు, భద్రతా దళాలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి.
  • సైనిక శిభిరాలను, వాహన శ్రేణులను టార్గెట్ గా చేసుకుని విధ్వంసానికి దిగుతున్నారు.
  • జవాన్ల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్న పాక్ దళాలు, తీవ్రవాద మూకలు.
  • దొంగ దెబ్బతీస్తున్న పాక్ దళాలు.
  • ఎదురుపడి యుద్ధం చేసే ధైర్యం లేక కుయుక్తులతో దొంగ దెబ్బలు.
  • సరిహద్దుల్లో తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *