శివగామి పాత్రను శ్రీదేవి ఎందుకు చేయలేదంటే…

    రాజమౌళి నిర్మించిన బాహుబలి చిత్రంలో రాజమాత శివగామి పాత్రకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. చిత్రంలోని రెండు భాగాల్లోనూ ఈ పాత్రను హైలెట్ చేశారు. శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించి మెప్పించారు. అయితే శివగామి పాత్రకు తొలుత రమ్యకృష్ణకు బదులుగా శ్రీవేదితో చేయించాలని అనుకున్నారట. దీనికి సంబంధించి కొంత చర్చలు కూడా జరిగాయని సినీవర్గాల కథనం. బాహుబలి టీం శ్రీదేవిని శివగామి పాత్రకోసం కలిసిందని అయితే ఆమె కొన్ని కారణాలతో ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. కథను విన్న శ్రీదేవి తొలుత చిత్రాన్ని చేసేందుకు అంగీకరించినా ఆ తరువాత బాహుబలిని ఆమె వదులుకున్నట్టు సమాచారం. సినిమాలో అత్యంత కీలకమైన శివగామి పాత్రను శ్రీదేవితో చేయించాలనే ఆలోచనతో ఆమెను కలిసిన యూనిట్ కు మొదట్లో ఆమె నుండి సానుకూల సంకేతాలు వచ్చినప్పటికీ ఆ  తరువాత శ్రీదేవి మనసు మార్చుకున్నట్టు సమాచారం.
     రెండు కారణాల వల్ల శ్రీదేవి శివగామి పాత్రను చేయడానికి ఒప్పుకోలేదట. ప్రభాస్ లాంటి సీనియర్ హీరోకి తల్లి పాత్రలో చేస్తే ఇక ముందు కూడా ఇదే తరహా పాత్రలు చేయాల్సి వస్తుందని భావించిన శ్రీదేవి ఆ పాత్రను వదులుకున్నట్టు సమాచారం. అయితే తనకు భారీ పారితోషకం ఇస్తే మాత్రం ఈ చిత్రంలో పనిచేసేందకు శ్రీదేవి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఆమె డిమాండ్ చేసిన పారితోషకం చూసి నిర్మాతలు వెనక్కితగ్గినట్టు సినీ వర్గాల సామాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *