రేషన్ షాపుల్లో ఇక నుండి చక్కెర లభించదు. చక్కెరపై ఇస్తున్న సబ్సీడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో ఇక నుండి రేషన్ షాపుల్లో చక్కెర లభించే అవకాశం లేదు. సబ్సీడీ లేకపోవడంతో రేషన్ షాపుల్లోనూ, బహిరంగ మార్కెట్ లోనూ ఒకే రేటులు చక్కెర లభిస్తుండడంతో చక్కెరను రేషన్ షాపుల్లో విక్రయించే అవకాశం లేకుండా పోయింది. పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చక్కెరపై సబ్సీడీని ఎత్తివేసినందున ఇక పై రేషన్ షాపులో చక్కెర లభించదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ ఉండదని సీఎం చెప్పారు.
పౌర సరఫరాలకు సంబంధించి కేసీఆర్ సమీక్ష జరిపి రేషన్ షాపుల ద్వారా ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సరుకలు సరఫరా చేయాలన్నారు.