టీవీ నటుడు ప్రదీప్ ది ఆత్మహత్యగానే పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాతే పూర్తి వివరాలను వెళ్లడిస్తామని పోలీసులు చెప్పారు. అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రదీప్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. పలువురు నటీనటులు, ప్రదీప్ సన్నిహితులు ఆయన్ని కడసారి చూసేందుకు తరలివచ్చారు. ప్రదీప్ తో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రదీప్ అఖస్మాత్తుగా మృతి చెందడం తమని కలచి వేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న ప్రదీప్ మరణం తమని కలసివేసిందని వారంటున్నారు.
ఎప్పుడూ సరదాగా గడిపే ప్రదీప్ కుటుంబ వ్యవహారాలను గురించి తమతో ఏమీ చర్చించేవాడుకాదన్నారు.భార్య పావని, ప్రదీప్ లు ప్రేమించి పెళ్లిచేసుకున్నారని వారు అన్యోన్యంగానే ఉండేవారని సన్నిహితులు చెప్తున్నారు. కొన్ని చిన్నచిన్న గొడవలు ఉన్నప్పటికీ అవి ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి చేరతాయనుకోలేదన్నారు.