విశాఖకు వీరజవాను బౌతిక కాయం

జమ్ముకాశ్మీర్ కుప్వారా జిల్లాలో సైనిక శిభిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీర మరణం పొంది విశాఖ పట్నానికి చెందిన వీర జవాన్ బొట్టా వెంకటరమణ మృతదేహానం విశాఖపట్నంకు చేరుకుంది. జవాను పార్థీవ దేహాన్ని సైనికాధికారులు ప్రత్యేక విమానంలో విశాఖకు తరలించారు. అక్కడి  నుండి ఆయన మృతదేహాన్ని ఐఎస్ఎస్ డేగాలో ఉంచారు. అక్కడ త్రివిధ దళాలకు చెందిన అధికారులు గౌరవ వందనం సమర్పించారు. అక్కడి నుండి వెంకటరమణ స్వగ్రామం ఆశవాని పాలెంకు తరలించారు. విగతజీవిగా ఉన్న వెంకటరమణను చూసిన కుటుంబ సభ్యలు, స్థానికులు బోరున విలపించారు.

వెంకటరమణ పార్థీవ దేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.  అక్కడ తీవ్ర ఉద్వేగ వాతావరణం నెలకొంది. కొద్ది రోజుల్లోనే సెలవుపై ఇంటికి వస్తానని చెప్పిన వెంకటరమణ విగతజీవిగా రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కాశ్మీర్ లో పనిచేస్తున్న సోదరుడు రెండు రోజుల్లోనే సెలవుపై ఇంటికి రావాల్సి ఉందని ఈలోపే ఇట్లా జరిగిందని వెంకరమణ సోదరుడు, ఆర్మీ జవాను అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో భాగంగా మహారాష్ట్రాలో ఉన్న ఆయన సోదరుడి మరణవార్తను తెలుసుని వెంటనే విశాఖకు చేరుకున్నారు. వెంకట రమణ బౌతిక కాయానికి ఆదివారం నాడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.