ఉ.కొరియా కవ్వింపు చర్యలు

అమెరికా హెచ్చరికలను ఉత్తర కొరియా అసలు పట్టించుకోవడం లేదు. అమెరికా దాని మిత్రపక్షాల బెదిరింపులను పెడచెవిన పెడుతూ మరోసారి బాలిస్టిక్ క్షిపణ  పరిక్షను నిర్వహించి వారిని మరింత రెచ్చగొడుతోంది.  కొరియా ద్వీప కల్పంలో యుద్ధా మేఘాలు కమ్ముకున్నా, అమెరికా నౌకలు ఉత్తర కొరియా కు సమీపంలోకి వచ్చినా ఉత్తర కొరియాకు ఏ మాత్రం పట్టడం లేదు. తాను అనుకున్నది చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తన దూకుడును కొనసాగిస్తూ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చెప్పట్టి తన వైఖరిని మారోసారి ఉ.కొరియా స్పష్టం చెసింది. ప్రయోగించిన క్షిపణి మీడియం రేంజ్‌ కేఎన్‌-17 బాలిస్టిక్‌ క్షిపణిగా గుర్తించినట్లు సమాచారం.
అయితే ఉ.కొరియా నిర్వహించిన పరీక్ష విఫలం అయిందని అమెరికా అంటోంది. వారి క్షిపణ ఉ.కొరియా భుబాగం దాటలేదని చెప్తోంది. వారి క్షిపణి వల్ల అమెరికాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అమెరికా రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. అది పూర్తిగా విఫల పరీక్ష అని తేల్చి చెప్పాయి. అయితే ఉ.కొరియా వాదన మాత్రం  మరోలా ఉంది. ఉ.కొరియా తాజా క్షిపణి పరీక్షపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి తెంపరితనం శాంతియత్నాలు చేస్తున్న చైనా ను కూడా వంచిచడమే అంటూ వ్యాఖ్యానించడం ద్వారా చైనా,ఉ.కొరియా ల మధ్య దూరం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు ట్రంప్. ఉ.కొరియాను నిలువరించడంలో చైనా పాత్రను ట్రంప్  కొనియాడిన వెంటనే ఈ క్షిపణి ప్రయోగం జరగడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *