ఆంధ్రజ్యోతిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి పేపర్ కార్యాలయం ముడో అంతస్తులో ఈ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కార్యాలయంలోని ఫర్నీచర్ కు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.