ఘనంగా ఓయు శాతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

ou
ఉస్మానియా విశ్వవిద్యాలయం సతాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్థు భాషల్లో ఉన్న సావనీర్ ను రాష్ట్రపతి ఆవిష్కరించి, శతాబ్ది భవన్ కు  ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సాంకేతిక అంశాలపై విశ్వవిద్యాలయాలు దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణల ద్వారా సమాజంలో మార్పులకు విశ్వవిద్యాలయాలు నాంది పలకాలన్నారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం శాతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉన్నత విద్యలో భారత్ ఏంతో పురోగతిని సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ 100 సంవత్సరాల క్రితం విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన నాటికి ఇప్పటికే ఏన్నో మార్పులు వచ్చాయని రానున్న సంవత్సరాల్లో మరిన్ని మార్పులు వస్తాయని అన్నారు. కాలంతో పాటుగా విద్యార్థులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
మేధావుల ఆలోచనలకు విశ్వవిద్యాలయాలు వేదికలు మారతాయని ఆ ఆలోచనలు సమాజ హితం కోసం ఉపయోగపడాలన్నారు. కేవలం ఉద్యోగం కోసం చదువు అనే విధానం పోయి సమాజ హితంకోసం, నూతన ఆవిష్కరణల కోసం విశ్వవిద్యాలయాలు వేదిక కావాలన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
 
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘ఓయూ అత్యున్నత విశ్వవిద్యాలయం. వందేళ్ల క్రితం మీర్‌ అలీ ఉస్మాన్‌ ఖాన్‌ దీన్ని ప్రారంభించారు. ఈ వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఉన్నత విద్యలో వందల సంవత్సరాల క్రితమే భారత్‌ ఆదర్శంగా నిలిచింది. ఉన్నత విద్యలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించాం. ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఐఐటీలో చదివిన వారికి వంద శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. మేధావుల ఆలోచనలకు విశ్వవిద్యాయాలు వేదికలుగా నిలుస్తున్నాయి. మేధావులు, విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలి. పారిశ్రామిక అంశాలకు దోహదపడేలా యూనివర్శిటీల్లో పరిశోధనలు జరగాలి’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *