ఢిల్లీలో బీజేపీ జోరు…

ఢిల్లీలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఢిల్లీలోని మూడు పురపాలక సంఘాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఇతర పక్షాలకు అందనంత దూరంలో ఉంది. తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలను అధికారులు వెల్లడిస్తున్నారు. మూడు పురపాలక సంఘాలకు కలిపి మొత్తం 270 స్థానాలు ఉండగా వీటిలో 181 స్థానాల్లో బీజేపీ ఆధిఖ్యంలో దూసుకుని పోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ  40 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 38 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు మొదలు పెట్టినప్పటినుండి బీజేపీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకుని పోతోంది. ఈ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం లో అధికారంలో ఉన్నా ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ప్రస్తుతం పురపాలక సంఘాల్లో అధికారంలో ఉన్న బీజేపీ తన పట్టును నిలుపుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా చతికిల పడింది.
ప్రతీ విషయంలోనూ ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తో పాటుగా మోడీపీ యుద్ధానికి ఢీ అంటే ఢీ అనే ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ ఎన్నికల ఫలితాలు భారీ ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. సామాన్యుడి పార్టీగా ఢిల్లీలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలున్నాయి.
Untitled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *