11మంది జావాన్లను బలిగొన్న మావోలు

ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. వారికి బాగా పట్టున్న సుకుమా జిల్లాలో 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మావోలు పొట్టన్న పెట్టుకున్నారు. బుర్కాపాల్-తింతాగుఫా మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సీఆర్ఫీఎప్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా జవాన్లను చుట్టుముట్టి భారీ ఎత్తున కాల్పులకు  తెగబట్ట మావోలు 11 మందిని పొట్టనపెట్టుకున్నారు. గస్తీ నిర్వహిస్తున్న జవాన్లను టార్గెట్ చేసుకుని మావోలు దాడిచేసినట్టు అధికారులు చెప్పారు. మావోల కాల్పుల్లో జవాన్ల మృతిని బస్తర్ డీఐజీ సుందర్ రాజు ధ్రువీకరించారు. జవాన్లు తేరుకుని మావోలపై ఎదురుదాడికి దిగారని అధికారులు వెళ్లడించారు.

సీఆర్పీఎఫ్ 74వ బెటాయిలన్ కు చెందిన జవాన్లు గాస్తీ నిర్వహిస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. గాయపడ్డ జవాన్లను హుటాహుటిన హెలిక్యాఫ్టర్లలో ఆస్పత్రికి తరలించారు.ఘటనా ప్రాంతానికి చేరుకున్న అదనపు బలగాలు గాలింపు చేపట్టాయి.

రాలు తెలుసుకుంటున్నారు.

Releated

సుష్మస్వరాజ్ కన్నుమూత

సుష్మాస్వరాజ్ కన్నుమూత…

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశాలు. తీవ్ర గుండెపోటుతో ఆమె చనిపోయారు. 67 సంవత్సరాల సుష్మ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్లే ఆమె పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. సుష్మాకు మంగళవారం రాత్రి గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సురి […]

సుదర్శన యాగం

యాదాద్రిలో భారీ ఎత్తున సుదర్శన యాగం

యాదగిరి గుట్ట దేవాలయ పుననిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చేదిద్దేపనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ యాగ నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి చర్చించారు. యాదాద్రిలో వంద ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో యాగం నిర్వహించాలని నిర్ణయించారు. మూడు వేల మంది రుత్వికులు, మరో 3వేల […]