మోడీ సాయం కోరిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను గురించి కేసీఆర్ ప్రధానితో చర్చించారు. గంటా 20 నిమిషాల పాటు వీరి భేటి సాగింది. రాష్ట్రప్రభుత్వం ముస్లీం,గిరిజనుల రిజర్వేషన్లకు సంబంధించి తీసుకుని వచ్చిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వ మద్దతును ముఖ్యమంత్రి కోరినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం నుండి పూర్తి స్థాయిలో మద్దతును ఇవ్వాలని సీఎం కోరారు. మస్లీం ల రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తున్న సమయంలో కేసీఆర్ ప్రధానికి రిజర్వేషన్ల ఎందుకని తీసుకుని రావాల్సి వచ్చిందో వివరించినట్టు సమాచారం. చాలా కాలంగా పెండిగ్ లో ఎస్సీ వర్గీకరణ పై కూడా కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని సీఎం  ప్రధాని దృష్టికి తీసుకుని వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆలస్యం చేయకుండా నిర్ణయం  ప్రకటించాలని సీఎం ప్రధానిని కోరారు.
జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలక్కుండా చూడాలని సీఎం కోరారు. ఓకే దేశం ఓకే పన్ను విధానానికి తాము మద్దతు ప్రకటించామని అయితే దీని వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ప్రధానిని కోరారు. రాష్ట్రాలు ఆదాయం కోల్పోతే ఆ ప్రభావం రాష్ట్ర అభివృద్ధిపై పడుతుందన్నారు. జీఎస్టీ విషయంలో మరింత స్పష్టత కావాలని ముఖ్యమంత్రి కోరారు. వ్యవసాయ అనుంబంధ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి పీఎం ను అభ్యర్థించారు. ప్రస్తుతం వ్యవసాయపై పచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇస్తున్నారని అదే విధంగా వివిధ వృత్తి పనులు చేసుకుని పొట్ట పోసుకునే వారికి సైతం పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా అనేక మందికి లాభం చేకురూతుందని కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకుని వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *