రాజకీయాల్లోకి హీరో సుమన్

దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనంపై ఇప్పటికే సినీహిరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుని పడగా ఆయనకు మరో తెలుగు నటుడి నుండి మద్దతు లభించింది. ఉత్తరాదికి చెందిన వ్యక్తి ప్రధాన మంత్రి పదవిని చేపడితే దక్షిణ భారత దేశానికి ఉప ప్రధాని పదవిని ఇవ్వాలంటూ సుమన్ డిమాండ్ చేశారు. దక్షిణాది ప్రజల హక్కులను కాపాడుకోవడం కోసం ఇది తప్పదని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు సుమన్ వెళ్లడించారు. రానున్న ఎన్నికల్లో తాను రాజకీయాల్లోకి వస్తానని తాను వీలైతే ఎన్నికల్లో పోటీ చేస్తానని లేదా తనకు నచ్చిన పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానన్నారు.

రాజకీయాలపై తనకు ఆశక్తి ఉందని చెప్పిన సుమన్ తాను ఏ రాజకీయ  పార్టీలోకి వచ్చేది ఇప్పుడే చెప్పనన్నారు.  త్వరలోనే తన రాజకీయ రంగ ప్రవేశానికి  సంబంధించిన వివరాలను వెళ్లడిస్తానని సుమన్ వివరించారు. ఈ పార్టీ అనేది చెప్పకపోయిన 2019 ఎన్నికల్లో మాత్రం తాను క్రియాశీలంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలపై తనకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయని అయన అన్నారు.