అసభ్య పోస్టులకు వారే బాధ్యులు

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసభ్య పోస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ అంటోంది. సభ్య సమాజం సిగ్గుతో తలగించుకునేలా చట్ట సభల గౌరవానికి భంగం కలిగేలా ఉన్న పోస్టులను సమాజిక మాధ్యామాల్లో పెట్టిన వ్యక్తి తాను వైసీపీ పార్టీకి చెందిన వాడినని ప్రకటించాడని దీనికి ఆ పార్టీ ఏమని సమాధానం చెప్తుందని టీడీపీ నేతల ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధంచి పోలీసులు అరెస్టు చేసిన రవికిరణ్ సాక్షిలో పనిచేస్తారంటూ అతని భార్య చెప్పిన సంగతిని ప్రస్తావిస్తూ సాక్షి పత్రిక, ఛానల్ ద్వారా విష ప్రచారం చేస్తున్న వైసీపీ అదికూడా సరిపోక  ఇప్పుడు పోషల్ మీడియా ద్వారా కూడా ప్రత్యర్థులపై లేనిపోని ప్రచారాలు చేస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.

ప్రత్యర్థులపై విషపు ప్రచారం కోసం వైసీపీ ఏకంగా ఒక సోషల్ మీడియా సెల్ నే నడుపుతోందని దీని ద్వారా తమ పార్టీ కార్యక్రమాల ప్రచారం కన్నా ఇతర పార్టీ నేతలపై బుదరచల్లేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారని వారు విమర్శించారు. ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వైసీపీ ఐటి సెల్ కు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులపై ఎంపీ విజయసాయి రెడ్డి దురుసుగా ప్రవర్తించడాన్ని వారు తప్పపట్టారు.  వైసీపీ నేతల ఆదేశాల మేరకే సోషల్ మీడియా లో విషపు ప్రచారం చేసినట్టు తేలిపోయింది కనుక అటువంటి పోస్టులు పెట్టిన వారు చట్టసభలో ఉండే నైతిక హక్కును కోల్పోయారని జగన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.