ఇదేం సెల్ఫీరా బాబు..ప్రాణం మీదకు తెచ్చిన సరదా

సెల్ఫీ పిచ్చి ముదిరిపాకాన పడుతోంది. రకరకాల సెల్ఫీ  తీసుకుంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా ప్రచారం పొందాలనుకుంటున్న యువత చివరకు ప్రాణం మీదకు తెచ్చుకుంటోంది. ఇటువంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మెడకు ఉరిబిగించుకుని సెల్ఫీకి ప్రయత్నించిన ఒక యువకుడు నిజంగానే తాడు మెడకు బిగుసుకుపోవడంతో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక లోని ఉడిపి జిల్లాలో జరిగింది. మెడకు ఉరితాడు బిగించుకుని సెల్పీ తీసుకునే క్రమంలో స్టూల్ పక్కకి ఒరగడంతో నిజంగానే మెడకు ఉరిబిగుసుకు పోయింది. ఐతే అదృష్టవశాత్తు దగ్గరలోనే అతని మిత్రుడు ఉండడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

హుటాహుటిన సదరు యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. సెల్ఫీల మోజులు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి.

Releated

మావోయిస్టులు

భారీ ఎన్ కౌంటర్ 14 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ… ఛత్తీస్ ఘఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో మహిళా మావోలు కుడా ఉన్నట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. చత్తీస్ ఘడ్ సుక్మాజిల్లాలోని గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. మావోలకు గట్టి పట్టున్న సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ తో పాటుగా ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి గాలింపు చేపడుతుండగా వారికి మావోలు […]

మల్లాది చంద్రమౌళి

ఆగస్టు 5న విజయం ఎక్స్ పో | vijayam Expo on august 5th

vijayam Expo… జౌత్సాహిక బ్రాహ్మణ వ్యాపారుల కోసం ఆగస్టు 5వ తేదీన ఈస్ట్ ఆనంద్ బాగ్ లో ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్టు నిర్వహాకులు మల్లాది చంద్రమౌళి తెలిపారు. విజయం ఎక్స్ పో పేరుతో మల్కాజ్ గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని గజానన ఫంక్షన్ హాల్ లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. బ్రాహ్మణ వ్యాపారులు ఇందులో స్టాల్స్ ఏర్పాటు చేస్తారని, అనేక వస్తువులను అతి తక్కువ ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్టు […]