20 మందిని బలిగొన్న లారీ

lorry lorry1 lorry3

చిత్తూర జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది ప్రణాలు కోల్పోగా మరో 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జిల్లాలోని ఏర్పేడులో పీఎన్ రోడ్డులో జరిగింది. భారీ లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి మొదట విద్యుత్ స్థంబాన్ని ఢికొట్టింది. ఆ తరువాత రోడ్డు పై ఉన్న దుకాణాలపైకి దూసుకుని పోవడంతో ఈ దారుణం జరిగింది. విద్యుత్ షాక్ తగలడంతో పాటుగా మంటలు ఎగిసిపడడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట ప్రధాన రహదారిపై స్తానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. గాయపడ్డవారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డుపై ఉన్న దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం భారీగా ఉంది.

లారీ ఢీకొనడంతో 6గురు ప్రాణాలు కోల్పోగా విద్యుత్ షాక్ తగిలడంతో 14 మంది ప్రాణాలు విడిచారు. దుసుకుని వస్తున్న లారీని తప్పించుకునే ఆస్కారం లేకపోడంతో దానికింద పది నలిగిపోయారు. లారీ భీబత్సానికి ప్రమాదం జరిగిన ప్రాతంలో భయానక వాతావరణం నెలకొంది. జిల్లా ఎస్పీతో పాటుగా పోలీసు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

లారీ వేగంగా వస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని దీనితో ఒక్కసారిగా వైర్లు తెగిపడి మంటలతో పాటుగా విద్యుత్ తీగలు తెగిపడి షాక్ కొట్టిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. దుకాణాల వద్ద నిలబడి ఉన్నవారిపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ లారీని వదిలి పరారైరనట్టు వారు చెప్పారు. చిత్తూరు ప్రమాదం పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని జిల్లా అధికార యంత్రాగాన్ని సీఎం  అదేశించారు. గాయపడ్డ వారికి వెంటనే మెరుగైన చికిత్సను అందచేయాలని సీఎం చెప్పారు.

Releated

టీఆర్ఎస్ తో బీజేపీ పోరు

బీజేపీతో ఇక సమరమే-పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు?

trs vs bjp బీజేపీ పై విమర్శల తీవ్రతను పెంచాల్సిందిగా టీఆర్ఎస్ అధినేత పార్టీ ముఖ్య నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో క్రమక్రమంగా బలం పెంచుకుంటూ పక్కలో బల్లెంగా మారేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రస్తుతానికి కాంగ్రెస్ కన్నా బీజేపీతో ఎక్కువ ప్రమాదం ఉందని కేసీఆర్ పార్టీ ముఖ్యుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. జాతీయ స్థాయిలోనూ పార్టీ పూర్తిగా బలహీన పడడంతో పాటుగా రాష్ట్ర స్థాయిలో నేతల మధ్య వైరుద్యాలు, కార్యకర్తల్లో నైరాశ్యం వంటి కారణాల […]

Jagan targets Chandra Babu

Is Jagan targeting Chandra Babu Naidu?

Is Jagan targeting Chandra Babu Naidu? Allegations are on uproar that Jagan is targeting Chandra Babu Naidu. The allegations from TDP comes after the decision of newly formed YCP government to demolish the Praja Vedika structure built adjacent to the present residence of Chandra Babu Naidu. The AP government, which held the meeting of collectors […]