టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక

0
2

తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సీనియర్ నేత నాయిని నర్సింహ్మారెడ్డి ప్రకటించారు. పార్టీ అధ్యక్షపదవికి జరిగిన పోటీలో కేసీఆర్ మినహా మరెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని నాయిని వివరించారు. ఇతరులు  ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో కేసీఆర్ ఏకంగా ఎంపికైనట్టు నాయిని నర్సింహ్మా రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ  రాష్ట్ర ప్రజలతో పాటుగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతా కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ది పధంలో దూసుకుని పోతోందన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ది సాధ్యం అనే సంగతి తెలంగాణను చూస్తే తెలుస్తోందన్నారు నాయిని.  టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎంపిక కావడం పై ఆ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో అగ్రగామిగా ఉంటుందని కార్యకర్తలు పేర్కొన్నారు.
 
టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. ఎన్నిక వివరాలను ప్రకటించిన సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here