నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే: సీఎం

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులకు కల్తీ విత్తనాలు ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదిలేదని అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మెవారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి జైలుకు  పంపిస్తామని కీసీఆర్ హెచ్చరించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం అధికారులకు సూచించారు. రైతుల సమస్యల పట్ల అలక్షం వద్దని చెప్పారు. ఎప్పటికప్పుడు అన్నాదాలకు అండగా నిలుస్తూ వారికి సహకరించాలన్నారు. తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శం  కావాలని సీఎం చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని తెలిపారు. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమిస్తామని తెలిపారు. త్వరలో వ్యవసాయం శాఖలో ఖాళీలు భర్తీ చేసి… ప్రమోషన్లు కల్పిస్తామని… గ్రామాల్లో రైతు కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు కేసీఆర్. రైతుల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయాడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.