విప్రోలో భారీగా ఉద్యోగులపై వేటు

దేశంలో మూడో అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ విప్రో పెద్ద మొత్తంలో ఉద్యోగులను ఇంటికి పంపే ప్రయత్నాలు చేస్తోంది. సక్రంగా పనిచేయని, సరైన ప్రతిభ చూపని ఉద్యోగులను బయటకు పంపాలని కంపెనీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు పెద్ద సంఖ్యలో విప్రో ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎంత మందిని తొలగిస్తారనే దానిపై సంస్థ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. ప్రస్తుతం విప్రోలో 1.7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తమ సంస్థ ప్రతిభావంతుల కోసం అన్వేషిస్తోందని అందులో భాగంగా కొత్తవాళ్లని తీసుకుని రావడం కోసం ప్రస్తుత ఉద్యోగుల్లో కొంత మందిని పక్కనపెట్టక తప్పదని విప్రో ప్రతినిధులు చెప్తున్నారు. కొత్తవారిని తీసుకోవడంతో పాటుగా ప్రస్తుతం సరిగా ప్రతిభ కనబర్చని వారిని తొలగిస్తామని చెప్పినా ఆ సంఖ్య ఎంత అనేది మాత్రం బయటకు చెప్పడం లేదు. విప్రో త్వరలో కనీసం ఆరు వందల నుండి రెండు వేల మంది దాకా ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Releated

శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్ ఆరోగ్యహారం – పేద ప్రజలకు గొప్ప వరం

చిత్తూరు జిల్లాలో “ఆరోగ్యహారం” పేరుతో శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్, శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సమాజసేవా ట్రస్ట్ లు సంయుక్తంగా సమగ్ర వైధ్య శిభిరాలను నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని మదనపల్లికి సమీపంలోని వి. కొత్తకోట కందుకూరు అగ్రహారం గ్రామంలో ప్రస్తుతం ఈ వైధ్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్టు ట్రస్టు ప్రతినిధిలు ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థల ఆధ్వర్యంలో పూర్తిగా సమగ్రంగా గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నామని శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సేవా ట్రస్ట్ బాధ్యాలు […]

5న పోలింగ్‌.. 9న ఫలితాలు

బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. అయితే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు […]