పట్టని ఉత్తర్వులు యదావిధిగా స్కూళ్లు….

తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సెలవలు ప్రకటించినా కొన్ని ప్రైవేటు స్కూళ్లు మాత్రం నిబంధనలు తుంగలో తొక్కి యధావిదిగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో ఎప్రిల్ 23కు బదులుగా ఎప్రిల్ 20వ తేదీ నుండే తెలంగాణ ప్రభుత్వం సెలవలు ప్రకటించింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జోఖ్యం చేసుకుని మూడు రోజుల ముందుగానే సెలవలు ప్రకటించినప్పటికీ ఈ  ఆదేశాలను కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. పాఠశాలలను యాదావిధిగా నడుపుతూ ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి.

కొన్ని మిషనరీ, ప్రైవేటు స్కూళ్లు యదావిధిగా నడుస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు వీరికి పట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సెలవలు ప్రకటించినప్పటికీ తరగతులను నిర్వహిస్తున్నాయి. వీరి అగడాలను ప్రశ్నించే నాధుడే లేకపోవడంతో ప్రైవేటు సంస్థల తమ  ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.

Releated

సుష్మస్వరాజ్ కన్నుమూత

సుష్మాస్వరాజ్ కన్నుమూత…

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశాలు. తీవ్ర గుండెపోటుతో ఆమె చనిపోయారు. 67 సంవత్సరాల సుష్మ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్లే ఆమె పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. సుష్మాకు మంగళవారం రాత్రి గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సురి […]

సుదర్శన యాగం

యాదాద్రిలో భారీ ఎత్తున సుదర్శన యాగం

యాదగిరి గుట్ట దేవాలయ పుననిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చేదిద్దేపనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ యాగ నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి చర్చించారు. యాదాద్రిలో వంద ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో యాగం నిర్వహించాలని నిర్ణయించారు. మూడు వేల మంది రుత్వికులు, మరో 3వేల […]