హ్యాపీ బర్త్ డే బాబు…

అనుకున్న లక్ష్యం చేరేవరకు విశ్రమించని తత్వం… నిరంతర పోరాటం… ఓటమిని అంగీకరించని తత్వం… వీటన్నింటినీ నిలువెత్తు ప్రత్యక్ష సాక్ష్యం నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పట్టుదలను ఆయన్ని వ్యతిరేకించేవారు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు. వ్యక్తిగత, వృత్తిగత క్రమ శిక్షణకు మారుపేరైన బాబు రాజకీయాలే శ్వాసగా జీవిస్తారనే ప్రచారం ఉంది. రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మరో రెండు పర్యాయాలు విపక్ష నేతగా ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు సవాళ్లను అధికమిస్తూ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు.హ్యాపీ బర్త్ డే చంద్రబాబు నాయుడు…..